APNGO Announced Donation for Flood Victims: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాల వారు ముందుకు వస్తున్నారు. ముందుకొచ్చిన ఈ దాతలు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి తోచినంత విరాళాలు ఇందిస్తున్నారు. అయితే తాజాగా వరద బాధితుల కోసం ఉద్యోగుల నుంచి భారీ విరాళం అందింది. ఏకంగా రూ.120 కోట్లు విరాళమిచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఏపీ ఎన్జీఓ భారీ విరాళం: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ఎన్జీఓ జేఏసీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతంలో ఒక రోజు బేసిక్ పే ద్వారా రూ.120 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. పెన్షనర్లు కూడా ఈ విరాళంలో భాగమైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని ఏపీ జేఏసీ నేతలు కేవి శివారెడ్డి, విద్యాసాగర్ తదితరులు సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. వరద సహాయం నిమిత్తం మొత్తం 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు విరాళం అందించారు. వారిని సీఎం చంద్రబాబు అభినందించారు.
Andhra University Employees: వరద బాధితులకు ఆంధ్ర యూనివర్శిటీ ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు ఏయూ ఉద్యోగులు, సిబ్బంది తెలిపారు.
ఆర్టీసీ కార్మిక పరిషత్: వరద బాధితులకు సాయం చేసేందుకు ఆర్టీసీ కార్మిక పరిషత్ ముందుకొచ్చింది. ఒకరోజు వేతనం విరాళం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ఆర్టీసీ కార్మిక పరిషత్ తెలిపింది. మిగతా సంఘాలతో ఏపీపీటీడీ ఎండీ మాట్లాడాలని కార్మిక పరిషత్ నేతలు కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మిక అధ్యక్షుడు సూరపనేని శేషగిరిరావు అనుమతి కోరారు. ఆర్టీసీలోని మిగతా సంఘాలూ ముందుకురావాలని ప్రచార కార్యదర్శి యార్లగడ్డ రమేశ్ పిలుపునిచ్చారు.
వరద బాధితులకు అండగా టాలీవుడ్ హీరోలు - తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం - Donations To Telugu States
పవర్‌స్టార్ గొప్ప మనసు - వరద బాధితులకు రూ.6 కోట్లు విరాళం - Pawan Dontation to Flood Victims