ETV Bharat / state

తిరుమలలో తెలంగాణ సిఫార్సు లేఖల స్వీకరణపై ఏపీ మంత్రి క్లారిటీ

యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్న ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ - తెలంగాణ సిఫార్సు లేఖల స్వీకరణపై కీలక ప్రకటన

AP Minister On Tirumala Recommendation Letters
Tirumala Recommendation Letters (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

AP Minister On TG Tirumala Recommendation Letters : తిరుమలలో తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లేఖల స్వీకరణపై స్పష్టత వచ్చింది. టీటీడీకి కొత్త బోర్డును నియమించిన తరువాతే తెలంగాణ నుంచి వచ్చే అన్ని సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆయన ఇవాళ యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఈవో భాస్కర్​ రావు, ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం లడ్డు ప్రసాదం, స్వామి వారి చిత్ర పటాన్ని ఆలయ ఈఓ భాస్కర్ రావు అందజేశారు.

తిరుమల తరువాత చాలా మంది భక్తులు దర్శించుకునే యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని మంత్రి హోదాలో దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సిఫార్సు లేఖల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా టీటీడీకి నూతన బోర్డు నియామకం తరువాత వాటిని స్వీకరించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

"టీటీడీకి ప్రస్తుతం బోర్డు లేదు. త్వరలో నూతన బోర్డు ఏర్పాటవుతుంది. ఆ తరువాత తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లేఖలను స్వీకరిస్తాం" - వాసంశెట్టి సుభాష్, ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి

ఆంధ్రప్రదేశ్​లో చంద్రబాబు నాయుడు సారధ్యంలో ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పటివరకున్న బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సహా 24 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఆ స్థానంలో నూతన బోర్డు నియామకంపై ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే బోర్డు ఛైర్మన్​ను, సభ్యులను నియమిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం జె.శ్యామల రావు టీటీడీ ఈవోగా వ్యవహరిస్తున్నారు.

తిరుమల వెళ్లే వారికి బిగ్ అలెర్ట్ - బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు!

తిరుమల భక్తులకు బిగ్​ అలర్ట్ - ఆ మార్గం మూసేశారు! - తెలియకపోతే ఫ్యామిలీకి తీవ్ర ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.