ETV Bharat / state

టెస్లాతో ఏపీ డీలింగ్స్ - ఎలాన్ మస్క్​ను ఇంప్రెస్ చేసేందుకు పక్కా ప్లాన్! - AP GOVT DEALINGS WITH TESLA

AP Govt Discuss With Tesla Management: ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని వివరిస్తూ పలు సంస్థలను రప్పించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్‌ వాహనాల తయారీలో అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ టెస్లాతో పాటు మరికొన్ని పెద్ద కంపెనీల యాజమాన్యాలకు అధికారులు లేఖలు రాస్తున్నారు.

AP Govt Discuss With Tesla Management
AP Govt Discuss With Tesla Management (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 1:23 PM IST

Tesla Management on Investments in AP : పెట్టుబడిదారులను ఏపీ రాష్ట్రానికి రప్పించేందుకు ఉన్న అవకాశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏపీని పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించింది. దీంతో ఎలక్ట్రానిక్‌ వాహనాల తయారీలో అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ టెస్లాతో పాటు మరికొన్ని పెద్ద కంపెనీల యాజమాన్యాలకు అధికారులు లేఖలు రాస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని వివరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కొన్ని సంస్థలు వైఎస్సార్సీపీ హయాంలో వివిధ కారణాలతో తమ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. దీంతో మరెక్కడా పెట్టుబడులు పెట్టని సంస్థలను గుర్తించి, రాష్ట్రానికి రావాలంటూ లేఖలు పంపుతున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2019కి ముందు వివిధ సంస్థలతో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల్లో గత ఐదు సంవత్సరాలలో ఎన్ని కార్యరూపం దాల్చాయి. మిగిలిన వాటి పరిస్థితేంటి? ఆ ఒప్పందాలు అమలు కాకపోవడానికి కారణాలేంటి అని అధికారులు విశ్లేషిస్తున్నారు.

సంస్థల అధికారులతో సంప్రదింపులు : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో రూ.13.12 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఆయా సంస్థలతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. పెట్టుబడులు గ్రౌండింగ్‌ కావడానికి అడ్డంకులేంటి. వాటిని అధికారుల స్థాయిలో పరిష్కరించడం సాధ్యమేనా? ప్రభుత్వం విధానపరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందా? అనే అంశాల ఆధారంగా ఆయా సంస్థల యాజమాన్యాలతో చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల పట్ల సానుకూలంగా ఉందన్న సందేశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలన్నదే ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.

కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న సంస్థల వివరాలను ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సేకరించింది. సుమారు 50కి పైగా సంస్థల వివరాలను ఈడీబీ సిద్ధం చేసింది. సంస్థలను వెంటనే వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు అవకాశమున్న పెట్టుబడులు ఏమిటన్నది అధికారులు గుర్తిస్తున్నారు. ఆయా సంస్థల యాజమాన్యాలతో సత్వరమే సంప్రదింపులు జరపనున్నారు. ప్రధానంగా అరబ్‌ దేశాల నుంచి పెట్టుబడులు రావడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టే సంస్థలను కూడా గుర్తించి, ఇప్పటి నుంచే వారితో చర్చలు జరుపుతామని ఓ అధికారి తెలిపారు.

'ఏపీకి శాపంగా జగన్ - రూ.446 కోట్లు పెట్టినా పోలవరం బాగయ్యే పరిస్థితి లేదు - మరో నాలుగేళ్లు వేచి చూడాల్సిందే' - CHANDRABABU ON POLAVARAM PROJECT

"ఎందుకు? ఏమిటి? ఎలా?"- పోలవరంపై అంతర్జాతీయ నిపుణుల అధ్యయనం - Internation Team For Polavaram

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.