ETV Bharat / state

ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల - టాప్‌ 10ర్యాంకర్లు వీరే! - AP EAPCET Results 2024 Released - AP EAPCET RESULTS 2024 RELEASED

AP EAPCET 2024 Results Released: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి సభ్యులు విడుదల చేశారు. ఈ పరీక్షకు 3.39 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 75.51 శాతం, అగ్రికల్చర్‌ విభాగంలో 87.11 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అధికారులు వెల్లడించారు.

AP_EAPCET_Results_Released
AP_EAPCET_Results_Released (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 6:53 PM IST

AP EAPCET 2024 Results Released: రాష్ట్రంలోని పలు కళాశాలల్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె. రామమోహన్‌ రావు, జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తదితరులు విడుదల చేశారు. ఈ పరీక్షకు 3.62 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.39 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు తాజాగా తుది ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,95,092 మంది అంటే 75.51 శాతం విద్యార్థులు అర్హత సాధించగా, అగ్రికల్చర్‌ విభాగంలో 70,352 మంది (87.11) శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అధికారులు వెల్లడించారు. పలువురు విద్యార్థులు అసాధారణ ప్రతిభతో టాప్‌- 10 ర్యాంకుల్లో నిలిచి సత్తా చాటారు. వీరిలో పలువురు తెలంగాణ విద్యార్థులు ఉండటం విశేషం. ఇంజినీరింగ్‌ విభాగంలో గుంటూరుకు చెందిన మాకినేని జిష్ణు సాయి మొదటి ర్యాంక్‌ సాధించారు.

ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల - టాప్‌ 10ర్యాంకర్లు వీరే! (ETV Bharat)

ఈఏపీసెట్ ఫలితాలపై జాప్యమేల? ప్రభుత్వ అలసత్వంపై 3లక్షల మంది విద్యార్థుల ఆగ్రహం - AP EAPCET Result Delay

ఇంజినీరింగ్‌ విభాగంలో టాప్‌ 10 ర్యాంకర్లు :

  • మొదటి ర్యాంకు - మాకినేని జిష్ణు సాయి (గుంటూరు జిల్లా)
  • రెండో ర్యాంకు - మురసాని సాయి యశ్వంత్‌ రెడ్డి (కర్నూలు)
  • మూడో ర్యాంకు - బోగాలపల్లి సందేశ్‌ (ఆదోని)
  • నాలుగో ర్యాంకు - పాలగిరి సతీశ్‌ రెడ్డి (బుక్కరాయసముద్రం- అనంతపురం)
  • ఐదో ర్యాంకు - కోమటినేని మనీశ్ చౌదరి (గుంటూరు)
  • ఆరో ర్యాంకు - యప్పా లక్ష్మీనరసింహారెడ్డి (సిద్దిపేట- తెలంగాణ)
  • ఏడో ర్యాంకు - గొల్ల లేఖాహర్ష (కర్నూలు)
  • ఎనిమిదో ర్యాంకు - పుట్టి కుశాల్‌ కుమార్‌ (అనంతపురం)
  • తొమ్మిదో ర్యాంకు - పరమారాధ్యుల సుశాంత్‌ (హనుమకొండ-తెలంగాణ)
  • పదో ర్యాంకు - కొమిరిశెట్టి ప్రభాస్‌ (అక్కపాలెం-ప్రకాశం)

అగ్రికల్చర్‌ విభాగంలో టాప్‌ 10 ర్యాంకర్లు :

  • మొదటి ర్యాంకు - ఎల్లు శ్రీశాంత్‌రెడ్డి (హైదరాబాద్‌)
  • రెండో ర్యాంకు - పూల దివ్యతేజ (తలుపుల, సత్యసాయి జిల్లా)
  • మూడో ర్యాంకు - వడ్లపూడి ముఖేశ్‌ చౌదరి (తిరుపతి)
  • నాలుగో ర్యాంకు - పేరా సాత్విక్ (పులిచెర్ల, చిత్తూరు జిల్లా)
  • ఐదో ర్యాంకు - ఆలూరు ప్రణీత (మదనపల్లె- అన్నమయ్య)
  • ఆరో ర్యాంకు - గట్టు భానుతేజ సాయి (పాపంపేట- అనంతపురం)
  • ఏడో ర్యాంకు - పెన్నమాడ నిహారిక రెడ్డి (హైదరాబాద్‌)
  • ఎనిమిదో ర్యాంకు - శంబంగి మనో అభిరామ్‌ (గాజువాక, విశాఖ)
  • తొమ్మిదో ర్యాంకు - శరగడం పావని (గాజువాక, విశాఖ)
  • పదో ర్యాంకు - నాగుదాసరి రాధాకృష్ణ (పార్వతీపురం)

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం - AP EAPCET 2024 Result

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.