AP CM Chandrababu Visit to Polavaram Project : ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి జిల్లా పర్యటన కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 2014-19లో సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా పనుల పురోగతిని పర్యవేక్షించేవారు. అదే తరహాలో ఇప్పుడూ సోమవారం రోజునే ప్రోజెక్టు సందర్శనను మొదలు పెట్టనున్నారు.
చంద్రబాబు ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఒంటిగంట 30 నిమిషాల వరకు పనులు పరిశీలించి, 3 గంటల 5 నిమిషాల వరకు ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి తిరుగు పయనమవుతారు.
CM Chandrababu to Polavaram : ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ ఎన్నింటిని కొత్తగా నిర్మించాలి? ఎన్నింటికి మరమ్మతులు చేయాలి? అనే విషయాలను ముందుగా తేల్చాల్సి ఉంది. ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం పెద్ద పరీక్ష కానుంది.
Polavaram Development : ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆదివారం ఆమె పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. ఫొటో ఎగ్జిబిషన్, బారికేడ్లు, తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని, హెలీఫ్యాడ్ ప్రాంతంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఐటీడీఏ పి.ఓ యం. సూర్య తేజ, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్, మండల అధ్యక్షులు చిన్ని, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
చంద్రబాబు సీఎం అయ్యాకే వస్తానని శపథం - ఐదేళ్ల తర్వాత పుట్టింటికి మహిళ
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు - సీఎం హోదాలో తొలి పర్యటన - AP CM VISITS POLAVARAM PROJECT