ETV Bharat / state

ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ - ఆ అంశాలపై చర్చ! - Two Telugu States CMs Meet

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 4:48 PM IST

Two Telugu States CMs Meet on July 6 : ఈ నెల 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర అధికారులు సిద్ధం చేస్తున్నారు. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్​కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై సీఎం రేవంత్​ స్పందిస్తూ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు.

Two Telugu States CMs Meet on July 6
Two Telugu States CMs Meet on July 6 (ETV Bharat)

AP CM Chandrababu to Meet TG CM Revanth Reddy on July 06 : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్​ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య ఈ నెల 6న సమావేశం జరగనుంది. ఈ కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు రాసిన లేఖకు సీఎం రేవంత్​ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అయితే ఈ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అలాగే ఇతర ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. సహచర మంత్రులు, ఉన్నతాధికారులతోనూ సీఎం చర్చించనున్నారు.

ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు కావడంతో హైదరాబాద్​లోని ఆస్తులు, ఇతర పెండింగ్​ అంశాలపై లోక్​సభ ఎన్నికల ముందే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలను గతంలోనే కేబినెట్​ సమావేశం ఎజెండాలో పొందుపరిచింది. అయితే లోక్​సభ ఎన్నికల పోలింగ్​ వరకు ఆ అంశాలపై చర్చించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో ఈ విషయాన్ని పక్కన పెట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపి లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో ఈనెల 6న చర్చించాల్సిన అంశాలపై ఎజెండాను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్​లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థి సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్​లోని తెలుగు అకాడమీ, అంబేడ్కర్​, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా రెండు రాష్ట్రాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ముఖ్య చిక్కులపై ముఖాముఖి : రాజ్​భవన్​, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్​ సంస్థల బకాయిలపైనా వివాదాలు ఉన్నాయి. వీటన్నింటిపై రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ పలు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపడంతో రెండు రాష్ట్రాలు ఏళ్లు తరబడి పెండింగులో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావచ్చని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి.

ఈనెల 6 విభజన హామీల పరిష్కారంపై చర్చించుకుందాం రండి - రేవంత్‌ రెడ్డికి చంద్రబాబు లేఖ - AP CM CBN Letter to CM Revanth

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి - చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ - cm revanth phone call to cbn

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.