ETV Bharat / state

బాలయ్య అన్​స్టాపబుల్ సీజన్ 4 - గెస్టుగా మరోసారి చంద్రబాబు - షూటింగ్ కంప్లీట్ - AP CM IN NBK UNSTOPPABLE SHOW

ఈనెల 24న బాలయ్య అన్​స్టాపబుర్ సీజన్- 4 ప్రారంభం - గెస్టుగా మరోసారి చంద్రబాబు నాయుడు - ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి

BABU IN NBK UNSTOPPABLE SEASON 4
AP CM Chandrababu In NBK Unstoppable Show (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2024, 9:52 AM IST

Updated : Oct 21, 2024, 10:01 AM IST

AP CM Chandrababu In NBK Unstoppable Show : నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమా నటుడిగా మరోవైపు ఎమ్మెల్యేగా నిత్యం బిజీబిజీగా గడుపుతున్నారు. పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన మూవీ షూటింగుల్లోనూ పాల్గొంటున్నారు. ఇక సినిమాలే కాకుండా బాలయ్య బాబు ఓటీటీలోనూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఆహా వేదికగా అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే అంటూ ప్రేక్షకులకు తనలోని మరో యాంగిల్​ను చూపిస్తున్నారు. ఎప్పుడు గంభీరంగా ఉండే ఆయన గెస్టులతో, ఆడియెన్స్​తో సరదాగా ముచ్చటిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్​కు రెడీ అవుతోంది.

అక్టోబర్ 24వ తేదీ నుంచి అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే సీజన్-4 ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సీజన్-4 మొదటి ఎపిసోడ్​లో గెస్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నట్లు తెలిసింది. ఆయనకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్​ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. అక్టోబర్ 20వ తేదీ ఆదివారం రోజున చంద్రబాబు ఈ షూటింగులో పాల్గొన్నారు. మధ్యాహ్నం సమయంలో అన్నపూర్ణ స్టూడియోకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రికి బాలకృష్ణతోపాటు ఆహా టీం సాదరస్వాగతం పలికింది.

'అన్​స్టాపబుల్' సీజన్ 4 -​ ఫస్ట్ ఎపిసోడ్​లోనే పవర్​ఫుల్ గెస్ట్-ఎవరంటే?

విడుదలైన అన్ స్టాపబుల్ షో సీజన్-4 ప్రోమో : ఇక గత సీజన్​లో చంద్రబాబు, నారా లోకేశ్ అన్​స్టాపబుల్ షోకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఆయన ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఈ షోలో పాల్గొననున్నారు. మరోవైపు చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ కూడా ఈ ఎపిసోడ్​లో గెస్టుగా రానున్నట్లు సమాచారం. ఇక గత సీజన్​లో ఓ ఎపిసోడ్​కు వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయణ్ను కూడా ఈ షోకు గెస్టుగా పిలిచి ఈ ముగ్గురితో మొదటి రెండు ఎపిసోడ్లు ప్లాన్ చేయాలని ఆహా టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకొని నాలుగో సీజన్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ షో సీజన్-4కు సంబంధించిన ప్రోమోను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రోమో బాలయ్య బాబు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇక తాజాగా ఈ టాక్ షోలో మొదటి ఎపిసోడ్​కు చంద్రబాబు రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎపిసోడ్ ప్రోమో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్​కు బాలకృష్ణ కుమార్తె తేజస్విని క్రియేటివ్ హెడ్​గా వ్యవహరిస్తుండటం విశేషం.

బాలయ్య 'అన్​స్టాపబుల్' సీజన్ 4 -​ ఈ సారి ఎంటర్​టైన్మెంట్​ మామూలుగా ఉండదు! - Unstoppable Season 4

Last Updated : Oct 21, 2024, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.