ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టుకు శాపంలా జగన్‌ - నిపుణుల కమిటీ నివేదికే కీలకం: చంద్రబాబు - white paper on polavaram project - WHITE PAPER ON POLAVARAM PROJECT

White Paper on the Polavaram : రాష్ట్రంలో నదుల అనుసంధానానికి గుండెకాయ పోలవరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అలాంటి పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ జగన్ ఓ శాపం లా మారాడని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు.

CM Chandrababu White Paper on the Polavaram
White Paper on the Polavaram (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 10:36 PM IST

CM Chandrababu White Paper on the Polavaram : పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసేందుకు జగన్ అహంతో దుస్సాహసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పిచ్చి కుక్కా, పిచ్చి కుక్కా.. అనే పదే పదే చెప్తూ మంచి కుక్కని చంపేసిన రీతిలో పోలవరం పట్ల వ్యవహరించాడని ఆయన ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటే, ఒక అంశంతో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నందున నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే ముందుకెళ్లగలమని స్పష్టం చేశారు. ప్రజా చైతన్యమే అన్నింటికీ పరిష్కారమార్గమన్న చంద్రబాబు.. రాజకీయాల్లో ఉండేందుకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వటం వల్ల తగిలిన శాపాలు ఇంకెంతకాలం వెంటాడతాయో కూడా చెప్పలేమన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబుతో గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ - ఆ అంశాలపై చర్చ!

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రాభివృద్ధికి జీవనాడి అయిన పోలవరానికి శాపం జగన్ అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. డయాఫ్రమ్ వాల్‌ను 436కోట్ల తో పూర్తి చేస్తే, ఇప్పుడు జరిగిన నష్టానికి మరమ్మతులు చేసేందుకే 447కోట్లు అవుతుందని వివరించారు. ఇంత ఖర్చు చేసినా నష్టం పూర్తిగా భర్తీ అవుతుందనేది సందేహమేనన్న సీఎం, కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే ఇప్పుడు 990కోట్లు అదనంగా ఖర్చవుతుందని తెలిపారు. ఇందుకు 2నుంచి 4సీజన్ల సమయం కూడా వృథా అవుతుందని అన్నారు.

జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆయన ధ్వజమెత్తారు. 2019 జూన్ నుంచి ఏజెన్సీలు తొలగించి పోలవరం పనులు నిలుపుదల చేశారని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం 2ఏళ్ల తర్వాత కానీ గుర్తించలేదని అన్నారు. 2009లో కూడా వైఎస్ కాంట్రాక్టర్ ని మార్చటం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయని, అదే తప్పు జగన్ 2019లో చేసి తీవ్ర తప్పిదానికి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ తప్పిదాలపై 2019 ఆగస్టు 16న జలవనరుల కార్యదర్శి పీపీఏకి లేఖకూడా రాశారని అన్నారు. పోలవరం పట్ల జగన్ ప్రభుత్వ తప్పిదాలపై నీతి ఆయోగ్ ఐఐటీ హైదరాబాద్ తో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ 2021 నవంబర్ 5న స్పష్టమైన నివేదిక ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు.

జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు నాలుగు విధాలా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. మొదటిది డయాఫ్రమ్ వాల్ అయితే, అప్పర్, లోయర్ కాపర్ డ్యాం లు దెబ్బతిన్నాయి, గైడ్ బండ్ దెబ్బతినడంతో పాటు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణమూ ఆగిపోయిందని అన్నారు. మొత్తంగా ప్రాజెక్టును గోదాట్లో ముంచేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇప్పుడు కేంద్రం అంతర్జాతీయ నిపుణులతో కమిటీ వేసి నిరంతర అధ్యయనం పెట్టిందని తెలిపారు.

ఇక్కడ ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు ఎత్తేయటంతో అంతర్జాతీయ నిపుణుల నివేదిక ఆధారంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. నిర్ణీత సమయానికి పోలవరం పూర్తి చేయకపోవడం వల్ల వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పోలవరంలో అవినీతి అంటూ ఎన్నో అసత్య ఆరోపణలు జగన్ చేసినా ఏ ఒక్కటీ నిరూపించలేకపోయాడని అన్నారు. ఐఏళ్ల పోలవరం నష్టం చూస్తుంటే బాధ, కోపం, ఆవేశం కలుగుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఏదేళ్లలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజల్లో చర్చ జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు కూడా గుర్తించారు కాబట్టే ఇంత అఖండ విజయం కూటమికి అందించారని తెలిపారు. మీడియాను కూడా భయపెట్టే పరిపాలన గత 5ఏళ్లలో జరిగిందని విమర్శించారు. న్యాయస్థానాలను సైతం బ్లాక్​ మెయిల్​ చేసేలా న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని విమర్శించారని మండిపడ్డారు. రాష్ట్ర పుననిర్మాణం జరగాల్సిన పరిస్థితి నెలకొందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

వివిధ అంశాలపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో వివరించాలని నిర్ణయించారన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలిచారు, ప్రజా సహకారంతో రాష్ట్రాన్ని నిలబెడతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా బడ్జెట్ కంటే ముందే తొలుత 7శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో నదుల అనుసంధానానికి గుండెకాయ పోలవరమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాంటి పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ జగన్ ఓ శాపంలా మారాడని ధ్వజమెత్తారు. వృధాగా సముద్రం లో కలిసే మూడు వేల టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకుని కరవు రహిత రాష్ట్రం గా మార్చే ప్రాజెక్టు ఇది అని పేర్కొన్నారు. అలాంటి ప్రాజెక్టు జగన్ చేసిన విధ్వంసానికి గురైందని తెలిపారు. 1941నుంచి తెలుగు ప్రజల కలగా పోలవరం ఉందని వెల్లడించారు.

90మీటర్ల కిందవరకూ డయాఫ్రమ్ వాల్ అత్యాధునిక సాంకేతికతతో పూర్తిచేసామని గుర్తు చేశారు. పోలవరం అంత భారీ ప్రాజెక్టు దేశంలో ఇక ఉండదేమోనని తెలిపారు. 2014లో తెలంగాణ లో 7ముంపు మండలాలు తాను ప్రమాణ స్వీకారం చేయకముందే ఏపీలో విలీనం జరిగేలా కృషి చేశానన్నారు. 31సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించి 72శాతం పూర్తి చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రిగా జగన్‌ పోలవరంపై అసెంబ్లీ వేదికగా ప్రతిఏటా చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియోతోపాటు మంత్రిగా అంబటి రాంబాబు చేసిన ప్రకటన వీడియోను మీడియా సమావేశంలో సీఎం ప్రదర్శించారు.

66 ఏళ్ల వయస్సులోనూ ఫైర్‌ బ్రాండే - ఏ పదవికైనా వన్నెతెచ్చిన వ్యక్తి అయ్యన్న : చంద్రబాబు - Chandrababu Naidu Comments

సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌ - AP ASSEMBLY SESSIONS 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.