ETV Bharat / state

హైదరాబాద్​లో డ్రగ్స్​పై కట్టుదిట్టమైన చర్యలు - పాజిటివ్​ అని తేలితే జైలుకే - Antinarcotics Police Clarity Drugs - ANTINARCOTICS POLICE CLARITY DRUGS

Antinarcotics Police Clarity on Madhapur Drugs : హైదరాబాద్​లోని మాదాపూర్​ డ్రగ్స్ పరీక్షలో నిందితుల వ్యవహారంలో పోలీసులు వివరణ ఇచ్చారు. ఓ డీజే పాత్ర అనుమానస్పదంగా ఉందని వెల్లడించారు. తరుచూ డ్రగ్స్​ తీసుకుంటున్నట్లు గుర్తించారు. మొత్తం 16 మందిని టెస్ట్​ చేయగా డీజే వ్యక్తితో సహా మరో ఇద్దరికి పాజిటివ్​గా రావడంతో కేసు నమోదు చేశామని చెప్పారు. విద్యాసంస్థల్లో యాంటి డ్రగ్స్ కమిటీలు పనిచేస్తున్నాయని తెలిపారు.

TNAB Inquiry on Drugs in Hyderabad
Antinarcotics Police Clarity on Madhapur Drugs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 3:45 PM IST

Antinarcotics Police Clarity on Madhapur Drugs : మాదాపూర్​లోని డ్రగ్స్ టెస్ట్​లో పట్టుబడ్డ ఇద్దరు నిందితుల వ్యవహారంలో తెలంగాణ యాంటినార్కొటిక్స్ పోలీసులు వివరణ ఇచ్చారు. తరచూ మాదాపూర్​, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న పబ్స్​కు వెళ్తున్న వారు, డ్రగ్స్​తో సంబంధం ఉన్నవారు, సేవిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఇందులో భాగంగా ఒక డీజే పాత్ర తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అతను ఎక్కువగా మాదాపూర్​, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న పబ్స్​కు వెళ్తున్నట్లు, డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు.

TNAB Inquiry on Drugs in Hyderabad : డీజేగా పని చేస్తున్న వ్యక్తి ఎవరెవరిని కలుస్తున్నాడో అనే విషయంపై అధికారులు నిఘా పెట్టారు. అనంతరం 16 మందిని గుర్తించామన్నారు. వారిని పిలిచి విచారించి తర్వాత మూత్ర పరీక్షలు నిర్వహించామన్నారు. ఇందులో డీజేతో సహా ఇద్దరికి పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కొకైన్, గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. వీరిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్​లో ఎన్డీపీఎస్ సెక్షన్ 27 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ కట్టడికి టీజీన్యాబ్ తీవ్రంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

టీజీన్యాబ్‌ మరింత పటిష్ఠం - త్వరలో నార్కొటిక్‌ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు - telangana anti narcotics bureau

Police Focus on Drugs in Educational institutions : రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడిలో ప్రజలు, యువత ముందుకు వస్తేనే పూర్తి స్థాయిలో విజయం సాధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవల కొకైన్ సేవిస్తూ పట్టుబడ్డ యువతి కూడా డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడిందని గుర్తుచేశారు. డ్రగ్స్ సరఫరా దారులకు దూరంగా ఉండాలని సూచించారు. వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని పేర్కొన్నారు. యూనివర్సిటీలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో డ్రగ్స్ విద్యార్ధులపై నిఘా ఉంచడం తప్పనిసరని వివరించారు. తరచూ బ్యాగులు, లాకర్లు తనిఖీ చేయాలని డ్రగ్స్, ఈ సిగరెట్స్ వినియోగించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పలు విద్యాసంస్థల్లో యాంటి డ్రగ్స్ కమిటీలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఒక వేళ ఇలా సమాచారం సేకరించలేకపోతే విశ్రాంత పోలీసు అధికారులను నియమించుకోవాలని సూచించారు.

హైదరాబాద్​లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్​ - రూ.4 లక్షల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.