ETV Bharat / state

'ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకుంటారు' : అనీ మాస్టర్​ కీలక వ్యాఖ్యలు - ANEE MASTER COMMENTS ON JANI MASTER

ఈ విషయం గురించి తెలిశాక చాలా బాధపడ్డా - బాధితురాలికి నా సపోర్ట్​ ఉంటుంది -​ జానీ మాస్టర్ వ్యవహారంపై అనీ మాస్టర్​ కీలక వ్యాఖ్యలు

Anee Master Facts on Jani Master
Anee Master Facts on Jani Master (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2024, 2:19 PM IST

Anee Master Facts on Jani Master : లైంగిక ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో జానీ మాస్టర్​కు ఇటీవల జాతీయ అవార్డు కూడా రద్దు అయిన విషయం విధితమే. తాజాగా ఈ అంశంపై మహిళా కొరియోగ్రాఫర్​ అనీ మాస్టర్​ స్పందించారు. జానీ మాస్టర్​పై కేసు అనేది చాలా బాధాకరమైన విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్​లో నిర్వహించిన ఓ ప్రెస్​మీట్​లో మాట్లాడారు.

అనీ మాస్టర్​ మాట్లాడుతూ, జానీ మాస్టర్​ ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించారని చెప్పారు. కానీ ఇలాంటి ఆరోపణలు రావడం తనను ఎంతో షాక్​కు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైందన్న విషయం తనకు తెలియదని, కానీ ఈ విషయం గురించి తెలిశాక చాలా బాధపడ్డానని చెప్పారు. ఇందుకు ఆమెకు తన సపోర్టు ఉంటుందని అన్నారు. కానీ నిజానిజాలు బహిర్గతం అయ్యే వరకూ ఏ విషయాన్నీ నేను నమ్మనని స్పష్టం చేశారు.

మా మాస్టర్​ గొప్ప అన్న ఆమె ఎందుకు కంప్లైంట్​ చేసింది : దాదాపు 6 నెలల క్రితం బాధితురాలు తమ మాస్టర్​ గొప్ప అని పలు సందర్భాల్లో చెప్పిందని అనీ మాస్టర్​ గుర్తు చేశారు. మాస్టర్​ను అంత గొప్పగా పొగిడిన ఆమె, ఇప్పుడు ఈ విధంగా కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో అందరిలాగే తనకూ సందేహం వచ్చిందని అన్నారు. ఇప్పుడు తాను ఏదైనా మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకుంటారని, ఆ భయంతోనే ఉన్నానన్నారు. జానీ మాస్టర్​ తనకు గురువుతో సమానమని, ఆయన ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చారని వివరించారు.

నేను ఎప్పుడూ ఇబ్బంది ఎదుర్కోలేదు : తాను ఆయనతో కలిసి చాలాసార్లు వర్క్​ చేశానని అనీ మాస్టర్​ తెలిపారు. కానీ ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదన్నారు. ఈ విషయం తర్వాత డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లపై నెగిటివిటీ ఎక్కువ అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా సున్నితమైన విషయం అని, అందుకే ప్రముఖ కొరియోగ్రాఫర్లు ఎవరూ దీనిపై మాట్లాడలేకపోతున్నారని ఆమె వివరించారు.

జానీ మాస్టర్​కు మరో షాక్​ - జాతీయ పురస్కారం తాత్కాలిక నిలిపివేత - jani master national award revoked

జానీ మాస్టర్​ కేసులో కొత్త ట్విస్ట్ - పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు - Joni Master rape case Latest News

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.