ETV Bharat / state

పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే - ప్రణాళికతో ముందుకు : ఏపీ సీఎం - ap cm chandrababu kuppam tour

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 4:24 PM IST

Updated : Jun 26, 2024, 10:22 PM IST

CM Chandrababu 2nd Day Visit To Kuppam: ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన ముగిసింది. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వినతులు తీసుకున్నారు. చంద్రబాబును చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కుప్పానికి వచ్చారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నేరవేర్చుతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

CBN in Kuppam 2nd day
CBN in Kuppam 2nd day (ETV Bharat)

AP CM Chandrababu Visit to Kuppam Day 2 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండోరోజుల పర్యటన ముగిసింది. రెండోరోజు ఉదయం కుప్పం ఆర్​ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సీఎంతో కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు చిత్తూరు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. అతిథిగృహం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సచివాలయ ఉద్యోగులకు విధులు కేటాయించారు. వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజల వివరాలు నమోదు చేసుకుని శాఖలవారిగా జాబితా రూపొందించారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొన్న చంద్రబాబు అనంతరం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలుపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు. దీని కోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు. గత పాలనకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం అన్నారు. బలవంతపు జనసమీకరణతో పెద్ద పెద్దమీటింగ్​లు, భారీ కాన్వాయ్​లతో సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండవని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు ఇప్పటికే చెప్పానన్నారు.

రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి సమగ్ర కార్యప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని అధికారులకు చంద్రబాబు తెలిపారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తి వేయాలన్నారు.

రౌడీయిజం చేసేవారు కాస్త జాగ్రత్త : రౌడీయిజం చేసేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. గత 5 సంవత్సరాలు అధికారులు మనసు చంపుకుని పనిచేశారని, వైఎస్సార్సీపీ నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహకరించారన్నారు. తన సొంత నియోజకవర్గానికి రాలేని, మాట్లాడలేని పరిస్థితిని గత ఐదేళ్లలో కల్పించారని తెలిపారు. తనపైనా హత్యాయత్నం కేసు పెట్టారని, 2019 వరకు తనపై ఒక్క కేసు కూడా లేదని గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు నాశనం అవ్వడంపై తాను చాలా బాధపడ్డానన్నారు. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఇంటింటికి తాగునీరు : కుప్పం నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికీ తాగునీరివ్వడంతో పాటు, హంద్రీనీవా కాల్వ పనులు పూర్తికి ప్రణాళిక సిద్దం చేయాలని తెలిపారు. వ్యవసాయంలో మెరుగైన విధానాలు తీసుకురావాలన్నారు. కుప్పానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెస్తామన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్ చేస్తామన్నారు. యువతలో నైపుణ్యాన్ని లెక్కించేందుకు, అవకాశాలు కల్పించేందుకు, వారిలో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని సీఎం తెలిపారు. రైతులకు సబ్సిడీలు అందించడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

ప్రతి శాఖ నుంచి పక్కా ప్రణాళికతో రావాలని నెలల వ్యవధిలోనే కుప్పంలో మార్పు చూపించాలి అని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అధికారుల సమీక్ష అనంతరం పిఈఎస్ మెడికల్ కళాశాలలో పార్టీ శ్రేణుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీనేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజలతో నేతలు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. పార్టీశ్రేణులతో సమావేశం ముగించుకున్న చంద్రబాబు హెలికాఫ్టర్​లో బెంగళూరు వెళ్లారు.

'చంద్రబాబు స్ట్రాంగ్ లీడర్​, కేంద్రంలో ఆయనే కింగ్ మేకర్- మోదీ కొన్నిసార్లు రాజీపడాల్సిందే!' - Senior Journalist N Ram Interview

ఏపీ ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాం : ఏపీ సీఎం చంద్రబాబు - AP CM Chandrababu Visit to Kuppam

Last Updated : Jun 26, 2024, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.