AP 10th Class Results 2024 Released Today : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్ష ఫలితాలలో 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,34,574 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 84.32 శాతం మంది పాసయ్యారు.
AP Tenth Class Results 2024 : 2803 పాఠశాలల్లో వంద శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 17 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత నమోదైంది. 96.37 శాతంతో మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా, 62.47 శాతంతో కర్నూలు జిల్లా చివరి స్థానంలో ఉంది. ఏపీ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 98.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదే విధంగా ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 96.72 శాతం విద్యార్థులు పాసయ్యారు.
పదోతరగతి విద్యార్థులకు అలర్ట్ - రిజల్ట్స్ వచ్చేది ఆరోజే? - Telangana ssc results 2024
ఏపీ మోడల్ స్కూళ్లలో 92.88 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 94.56 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. అదే విధంగా ఆశ్రమ పాఠశాలల్లో 90.13 శాతం, కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో 88.96 శాతం, కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో 88.96 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 89.64 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 79.38 శాతం పాసయ్యారు. ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో 80.01 శాతం, మున్సిపల్ హైస్కూళ్లలో 75.42 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 74.40 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 69.26 శాతం మంది ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించగా, 11.87 శాతం మంది సెకండ్ క్లాస్లో, 5.56 శాతం మంది థర్డ్ క్లాస్లో పాసయ్యారు.
మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. రేపటి నుంచి ఆన్‌లైన్‌లోనే సప్లిమెంటరీ, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని అన్నారు. మెమోలు 4 రోజుల్లో వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తామని సురేష్ కుమార్ చెప్పారు. ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net, https://results.bse.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా (Websites For SSC Result) తెలుసుకోవచ్చు.
SSC భారీ నోటిఫికేషన్ - ఇంటర్ అర్హతతో 3712 పోస్టులు భర్తీ! - SSC Jobs 2024
విద్యార్థులారా బీ రెడీ - ఈనెల 24న ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్ - TELANGANA INTER RESULTS DATE 2024