ETV Bharat / state

టెట్‌ అర్హత సాధించని వారికి మంత్రి లోకేశ్‌ గుడ్ న్యూస్‌ - వారికి మళ్లీ పరీక్ష పెడతారంటా - Minister Nara Lokesh on TET Result - MINISTER NARA LOKESH ON TET RESULT

AP Minister Nara Lokesh on AP TET Results : టెట్ ఫలితాలలో అర్హత సాధించని వారికి మంత్రి నారా లోకేశ్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇప్పుడు అర్హత సాధించని వారికి, మరోసారి టెట్ నిర్వహిస్తామని అన్నారు. అదే విధంగా కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారికి త్వరలోనే మళ్లీ టెట్ ఉంటుందని, టెట్ ఫలితాల తర్వాత మెగా డీఎస్సీ ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీకి అందరూ సన్నద్ధం కావాలని లోకేశ్ పిలుపునిచ్చారు.

AP Minister Nara Lokesh on AP TET Results
AP Minister Nara Lokesh on AP TET Results (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 7:53 PM IST

AP Minister Nara Lokesh on AP TET Results : ఏపీలో ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి అందరూ సన్నద్ధం కావాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. గత మూడు నెలలుగా ఎదురుచూస్తున్న ఏపీ టెట్ ఫలితాలను ఈరోజు విడుదల చేశామన్నారు. టెట్​లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షల మంది నిరుద్యోగులు ఆతృతగా ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు.

ఇప్పుడు అర్హత సాధించని వారికి మరోసారి టెట్ : టెట్​లో అర్హత సాధించిన అభ్యర్థులకు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఈ టెట్​లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత మెగా డీఎస్సీ ఉండబోతుందని తెలిపారు. https://cse.ap.gov.in లింక్ ద్వారా టెట్ ఫలితాలను తెలుసుకోవచ్చు

నేడు విడుదలైన టెట్‌-2024 ఫలితాల్లో 58.4 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. టెట్‌-2024లో లక్షా 37 వేల 904 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించగా, ఇప్పుడు అర్హత సాధించని వారికి మరోసారి టెట్‌ నిర్వహిస్తామని నారా లోకేశ్ తెలిపారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తయిన వారికి కొత్త టెట్‌లో అవకాశం కల్పిస్తామన్నారు.

మంత్రిగా లోకేశ్ బాధ్యతల స్వీకరణ - సమర్థంగా నిర్వహించాలని తల్లి భువనేశ్వరి పోస్ట్ - Bhuvaneshwari Wishes to Lokesh

Minister Nara Lokesh Praja Darbar : ఆరు నెలల్లో స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం సామాన్యులు, ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజాదర్బార్​కు తరలివచ్చారు. ఉండవల్లి నివాసంలో లోకేశ్​ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంగళగిరికి చెందిన లక్ష్మీనరసింహా గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు లోకేశ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు.

ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం: మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని మంగళగిరిని గోల్డ్ హబ్​గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని లోకేశ్ అన్నారు. ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఉండవల్లి పంచాయతీలో మహిళా పారిశుద్ధ్య కార్మికులపై లైంగిక వేధింపులతోపాటు ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రైట్ హ్యాండ్​గా పేరుగాంచిన రాంబాబును విధుల నుంచి తొలగించాలని ఫిర్యాదు చేశారు. మహిళా కార్మికులపై ఇష్టానుసారంగా వ్యక్తిగత దూషణలకు దిగడంతోపాటు వేతనం తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐటీ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతల స్వీకరణ - తొలి సంతకం ఆ దస్త్రంపైనే - Nara Lokesh Takes Charge

'ఈ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా జగన్' - మంత్రి లోకేశ్​ ధ్వజం - nara lokesh tweet on YSRCP Offices

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.