ETV Bharat / state

YUVA : అమ్మపాడే జోలపాటతో నెట్టింట్లో సంచలనం - ఆ సింగర్​ ఎవరో తెలుసా? - Amma Pade Jola Pata Singer Jahnavi - AMMA PADE JOLA PATA SINGER JAHNAVI

YouTube Sensation Amma Pade Jola Song : అమ్మ ప్రేమకు కొలమానం లేదు. ఆ ప్రేమను వర్ణిస్తూ రాసిన ఎన్ని పాటలు విన్నా, ఆ మాతృత్వపు మాధుర్యం వెలకట్టలేనిది. అందుకే అమ్మపై వచ్చే ప్రతీ పాట ప్రతి మనిషి మనసునూ తాకుతుంది. అలాంటి పాటే ఈ అమ్మ పాడే జోల పాట కూడా. అందుకు నిదర్శనమే ఈ పాట విజయవంతమైన తీరు. అతి తక్కువ సమయంలో కోట్లాది మందికి చేరువై అందరి నోటా వినిపిస్తోంది. సామాజిక మాద్యమాల్లో ఎక్కడ చూసినా ఈ పాటపైనే చర్చ. అటువంటి పాటను పాడిన అమ్మాయి ఎవరు? ఆమె విశేషాలు ఏంటో చూద్దామా!

Singer Jahnavi Yerram Biography
Amma Pade Jola Pata Singer Jahnavi Yerram (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 8:37 PM IST

అమ్మపాడే జోలపాటతో నెట్టింట్లో సంచలనం - ఆ సింగర్​ ఎవరో తెలుసా? (ETV Bharat)

Amma Pade Jola Pata Singer Jahnavi Yerram Life Story : ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చి స్వరకల్పన చేయగా, జాహ్నవి యర్రం ఆలపించింది. మిట్టపల్లి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన గీతాలను అందించి మంచి గుర్తింపు తెచ్చుకోగా, జాహ్నవికి మాత్రం ఇదే తొలిపాట.

మిట్టపల్లి చిక్కటి సాహిత్యానికి జాహ్నవి చక్కటి గాత్రం తోడుకావడంతో అమ్మ పాట యూట్యూబ్ వేదికగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన అమ్మ పాటల్లో అద్భుతమైన పాటగా ప్రశంసలందుకుంటూ సూపర్ డూపర్ హిట్​గా ట్రెండింగ్​లో దూసుకుపోతుంది. 2024 మే 5న విడుదల చేసిన ఈ పాట 25 రోజుల్లోనే కోటికిపైగా వ్యూస్ సంపాదించుకుంది. అంతేకాకుండా మ్యూజిక్ వీడియోల్లో టాప్ 10లో నిలిచింది.

Singer Jahnavi Yerram Biography : ఈ పాటలోని సాహిత్యాన్ని వర్ణిస్తే అతిశయోక్తిలా అనిపిస్తుంది. కానీ ఆ పాట పాడిన జాహ్నవి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జాహ్నవి ముంబయిలో పుట్టి పెరిగిన అమ్మాయి. తండ్రి చార్టెడ్ అకౌంట్, తల్లి గృహిణి. తొమ్మిదో తరగతి నుంచి జాహ్నవికి పాటలు పాడటమంటే ఇష్టం. సంగీతంపై మక్కువ పెంచుకుంది.

అది గ్రహించిన కుటుంబసభ్యులు, జాహ్నవిని ముంబయిలో ప్రఖ్యాత గాయకులు గులామ్ ముస్తఫా ఖాన్ సాబ్ వద్ద సంగీతం నేర్పించారు. సోనూ నిగమ్, హరిహరణ్ లాంటి గొప్ప గొప్ప గాయనీ గాయకులను అందించిన గులామ్ ముస్తఫా ఖాన్ బృందంలో హిందూస్థానీ క్లాసిక్ మ్యూజిక్ నేర్చుకోవడం జాహ్నవి పాటల ప్రస్థానం మొదలైంది. అలా తనకు నచ్చిన పాటలను పాడుతూ వాటిని ఇన్​స్టా, యూట్యూబ్​లో పోస్టు చేస్తూ సాధన చేయడం మొదలుపెట్టింది.

అమ్మపాడే జోలపాటతో నెట్టింట్లో సంచలనం : అలా ఓరోజు ఇన్​స్టాలో జాహ్నవి పాడిన పాట, రచయిత మిట్టపల్లి సురేందర్ దృష్టికి వచ్చింది. జాహ్నవి గాత్రాన్ని చూసిన మిట్టపల్లి, అమ్మ పాటను పాడించాలని నిర్ణయించుకున్నారు. తెలిసిన వ్యక్తుల ద్వారా జాహ్నవిని సంప్రదించి హైదరాబాద్​కు ఆహ్వానించారు. నెల రోజులపాటు రకరకాల తెలుగు పాటలను పాడించి పరీక్షించాడు.

ఆ తర్వాత అమ్మ పాటను, అందులోని పదాల అర్థాలను ఆసాంతం వివరించి రఫ్ ట్యూన్​తో పాడించారు. పాటపై, అందులోని పల్లవి, చరణాలపై జాహ్నవి పట్టు సాధించాక అసలు పాటను రికార్డు చేయించారు మిట్టపల్లి. వాస్తవానికి ఈ పాట 20 ఏళ్ల కిందట రాశారు మిట్టపల్లి. ఖమ్మం జిల్లాలో పనిచేస్తుండగా ఓ రోజు కిన్నెరసాని ఒడ్డున కూర్చొని తన తల్లితో మాట్లాడుతుండగా ఫోన్ సిగ్నల్స్ అందక వేదన పడ్డాడు. అప్పుడే ఈ పాట పుట్టింది.

YouTube Sensation Amma Pade Jola Song : వెండి వెన్నెల్లో నిండైన కిన్నెరసాని ప్రవాహం ఒడ్డున రాసిన ఆ నాటి అమ్మపాట, ఇప్పుడు పురుడు పోసుకొని ప్రపంచం మొత్తం అద్భుతః అనేలా దూసుకుపోతుంది. అయితే పాట విడుదల చేసే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఐపీఎల్ జోరు కొనసాగుతుంది. తమ పాట ఎవరు వింటారులే అనుకున్న జాహ్నవి, మిట్టపల్లిలకు ఊహించని అనుభవం ఎదురైంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించి ట్రెండింగ్ లోకి రావడం ఆశ్చర్యపోయేలా చేసింది.

తన తొలి పాటకే ఈ స్థాయిలో ఆదరణ లభించడం పట్ల జాహ్నవి పట్టరాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. చిన్నప్పుడు సినిమాల్లో పాటలు పాడాలన్న తన కల, అమ్మ పాటతో అవకాశాన్ని తెచ్చిపెట్టడం జీవితంలో మరిచిపోలేనని చెబుతోంది. 20 ఏళ్ల కిందట రాసిన పాట, తాను పాడాలని రాసిపెట్టి ఉందని జాహ్నవి ఉద్వేగానికి గురైంది. తెలుగులోనే కాదు తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ పాటను జాహ్నవి ఆలపించింది.

Mittapalli Surender Preparations on Amma Song : వాటిని ఒక్కొక్కటిగా విడుదల చేసేందుకు మిట్టపల్లి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా తాను రచించిన మరికొన్ని పాటలను కూడా జాహ్నవితో పాడించేందుకు మిట్టపల్లి సురేందర్ సన్నాహాలు మొదలుపెట్టారు. కష్టపడితే ఏదీ వృథా పోదంటోన్న జాహ్నవి, ఇన్​స్టా వేదికగా తన ప్రతిభను చాటుకొని అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

ఒక్కపాటతోనే కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. జాహ్నవి లాంటి ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు తమ ప్రతిభకు తగిన అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారంటోన్న మిట్టపల్లి, తన పాటలతో కొత్త గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రానున్న రెండేళ్లలో కేవలం మ్యూజిక్ అల్బమ్స్​పైనే పని చేస్తానంటున్నారు మిట్టపల్లి సురేందర్.

సంగీత ప్రపంచంలో అణిముత్యాలాంటి పాటలు : అమ్మ పాట వెనుక వీరు పడిన శ్రమకు ఫలితం దక్కింది. ఈ పాట ఘన విజయంతో మిట్టపల్లి మరిన్ని స్ఫూర్తి వంతమైన పాటలు రచిస్తుండగా, జాహ్నవికి నేపథ్య గాయనీగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా మంచి గాయనీగా ఎదగాలని జాహ్నవి ఆకాంక్షిస్తోంది. జాహ్నవి లాంటి నేటి తరం అమ్మాయిలు సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి తమ ప్రతిభను చాటుకోవాలని మిట్టపల్లి సూచిస్తున్నాడు.

మరి ఇంకెందుకు ఆలస్యం, మీలోనూ జాహ్నవి లాంటి అమ్మాయిలుంటారు, మిట్టపల్లి లాంటి రచయితలు ఉండే ఉంటారు. ఎవరో అవకాశమిస్తారని చూడకుండా ఇన్​స్టా, యూట్యూబ్ వేదికగా ప్రయత్నాలు మొదలుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకోండి. నేలతల్లిపై మొలిచే పచ్చని పైరులా, సంగీత ప్రపంచంలో అణిముత్యాలాంటి పాటలు అంకురించేలా చేయండి.

YUVA : పేదింటి పెన్సిల్​ ఆర్టిస్టు - డ్రాయింగ్‌తో చిత్రాలకు ప్రాణం పోస్తున్న యువకుడు - pencil artist ganesh

'ఇంగ్లీష్‌ మీరే కాదు మేమూ మాట్లాడగలం - అదీ గుక్కతిప్పుకోకుండా' - ఆంగ్లంలో అదరగొట్టేస్తున్న విద్యార్థినులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.