ETV Bharat / state

కాంగ్రెస్‌ పాలన అంతా కుంభకోణాల మయం: అమిత్‌ షా - Amit Shah Public Meeting LB Stadiun

Amit Shah Public Meeting in LB Stadium : కాంగ్రెస్‌ పాలన అంతా కుంభకోణాల మయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్​ఎస్​, మజ్లిస్‌ మూడు వారసత్వ పార్టీలేనని దుయ్యబట్టారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్​ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో, ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి, ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Amit Shah Telangan Tour Shedule
Amit Shah Public Meeting in LB Stadium
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 12, 2024, 4:55 PM IST

Updated : Mar 12, 2024, 7:17 PM IST

Amit Shah Public Meeting in LB Stadium : తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బూత్‌ స్థాయి(Booth Level) అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షా, ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో బీజేపీకి 12 కంటే ఎక్కువ స్థానాలు రావడం ఖాయం : అమిత్‌షా

కాంగ్రెస్‌ పాలన అంతా కుంభకోణాల మయమని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్​ఎస్​, మజ్లిస్‌ మూడు వారసత్వ పార్టీలేనని దుయ్యబట్టారు. మోదీని(PM Modi) మూడోసారి ప్రధానిగా చేద్దామని, 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దామని అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడికెళ్లినా, మోదీ నామస్మరణే మార్మోగుతుందని అమిత్ షా అన్నారు.

కాంగ్రెస్‌ పాలన అంతా కుంభకోణాల మయం: అమిత్‌ షా

Amit Shah Fires on Opposing Parties : తెలంగాణ ప్రజలు బీజేపీ 12కు తగ్గకుండా ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​, మజ్లిస్‌ ఒక్కటేనని కేంద్రమంత్రి అమిత్​ షా ఆరోపించారు. మజ్లిస్‌ అజెండాతోనే హస్తం, గులాబీ పార్టీలు పనిచేస్తాయని విమర్శించారు. ఈ మూడు పార్టీలు కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తాయని, తమ వారసుల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. సభానంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని(Charminar Bhagyalakshmi Temple) అమిత్ షా దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత పాల్గొన్నారు.

"మోదీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.6 వేల చొప్పున వేస్తూ, అండగా ఉంటోంది. వచ్చే ఐదేళ్లలో దేశమంతటా, ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు సరఫరా చేస్తుంది. ఇప్పటికే 14 కోట్ల ఇళ్లకు మంచినీటి నల్లా కనెక్షన్లు ఇచ్చాం. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా మజ్లిస్‌కు భయపడుతోంది. పదేళ్ల యూపీఏ పాలనలో తెలంగాణకు రూ.1.17లక్షల కోట్లు మాత్రమే వస్తే, మోదీ పాలనలో మాత్రం ఇప్పటికే రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లు వచ్చాయి. బీజేపీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు."-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

కాంగ్రెస్‌ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారు : మోదీ నేతృత్వంలోనే దేశం ఎంతో అభివృద్ధి చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు.​ తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచుకున్నదన్న ఆయన, కేసీఆర్‌(KCR) నియంతృత్వ పాలనతో రాష్ట్రాన్ని ఎదగనివ్వలేదని ఆరోపించారు. ఈసారి రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లు కమలం పార్టీ గెలవాలని కోరారు. మజ్లీస్‌ పీడ తొలగాలని పాతబస్తీ వాసులు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి తెలిపారు. రాహుల్‌ గాంధీ, పార్లమెంట్‌ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ నేతలు తెలంగాణలోని బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ఆసక్తిరేపుతున్న ఆదిలాబాద్‌ ఎంపీ సీటు - జోరందుకున్న రాజకీయ వలసలు

లోక్​సభ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ నజర్​- అభ్యర్థుల రెండో లిస్ట్ రెడీ!

Last Updated : Mar 12, 2024, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.