ETV Bharat / state

కాపాడాల్సిన వాడే కాజేశాడు - అమెజాన్​ సంస్థలో రూ.3.22 కోట్లు స్వాహా చేసిన ఉద్యోగి అరెస్టు - Amazon Former Employee Fraud - AMAZON FORMER EMPLOYEE FRAUD

Amazon Former employee arrested : అమెజాన్​లో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ రాజీనామా చేసిన ఉద్యోగులకు అందాల్సిన రూ.3.22 కోట్ల డబ్బును కాజేసిన వ్యక్తిని సైబరాబాద్​ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. చెల్లింపుల పేరిట పక్కదారి పట్టించిన డబ్బును 50 బ్యాంకు ఖాతాలకు సదరు వ్యక్తి మళ్లించాడు. ఇటీవల అమెజాన్​ సంస్థకు చెందిన అంతర్గత దర్యాప్తు బృందాలు నిశిత పరిశీలనలో కొన్ని అవకతవకలు జరిగినట్లుగా గుర్తించడంతో పోలీసులను ఆశ్రయించాయి.

Amazon Former employee arrested
Amazon Former employee arrested (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 10:26 PM IST

Amazon Former Employee Fraud And Arrested : అమెజాన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో పనిచేస్తూ ఆ సంస్థకు చెందిన రూ.3.22 కోట్ల మేర కొట్టేసిన వ్యక్తిని సైబరాబాద్‌ ఆర్ధిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. సంస్థలో పనిచేసి రాజీనామా చేసిన మాజీ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల పేరిట నిధులు పక్కదారి పట్టించి వచ్చిన డబ్బంతా తన బంధువులు, స్నేహితులకు చెందిన 50 బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు. అమెజాన్‌ సంస్థ ఆర్థిక అవకతవకలను గుర్తించి సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇంతకీ ఏం జరిగిందంటే? : సరూర్‌నగర్‌కు చెందిన ఎం.వెంకటేశ్వర్లు గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లాలోని అమెజాన్‌ క్యాంపస్‌లో 2015లో ఉద్యోగంలో చేరాడు. సీనియర్‌ ఫైనాన్షియల్‌ ఆపరేషనల్‌ అనలిస్ట్‌ హోదాలో అమెజాన్‌ ఇండియా ఉద్యోగుల పేరోల్, సంస్థ నుంచి బయటకు వెళ్లిన వారి బకాయిల చెల్లింపులకు సంబంధించి సెటిల్‌మెంట్‌ వ్యవహారాలు పర్యవేక్షిస్తుంటాడు. సంస్థ ఉద్యోగుల వేతన వ్యవహారాలు చూసే వెంకటేశ్వర్లుకు చెల్లింపులు, క్లెయిముల పరిష్కారంపై పూర్తి అవగాహన ఉంది. ఈ క్రమంలోనే సంస్థను వీడిన మాజీ ఉద్యోగుల్లో కొందరు దీర్ఘకాలంగా తమ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి దరఖాస్తు, క్లెయిమ్ చేసుకోలేదని గుర్తించాడు.

To Take Unclaimed Money Of Employees : క్లెయిం చేసుకోని సంస్థ మాజీ ఉద్యోగుల డబ్బును తాను కాజేయాలని పథకం వేశాడు. బకాయిలు చెల్లించాలంటూ మాజీ ఉద్యోగుల పేర్లతో తానే దరఖాస్తు, క్లెయిము చేయించాడు. ఇలా దరఖాస్తు చేయించిన తర్వాత మాజీ ఉద్యోగి బ్యాంకు ఖాతా బదులు తనకు సంబంధించిన వారి బ్యాంకు ఖాతాల వివరాలు అందులో నమోదు చేసేవాడు. చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని తన కింది సిబ్బందికి సూచించేవాడు. ఆ తర్వాత సంస్థ ఆమోదం రాగానే నగదు బదిలీ అవుతుంది.

నకిలీ అభ్యర్థనలతో రూ.3.22 కోట్లు స్వాహా : నిందితుడు వెంకటేశ్వర్లు 2016- 2023 మధ్య 184 మంది పేర్లతో నకిలీ అభ్యర్థనలు పెట్టి మొత్తం రూ.3.22 కోట్లు దారి మళ్లించాడు. ఈ సొమ్మంతా తన బంధువులు, స్నేహితులకు చెందిన 50 బ్యాంకు ఖాతాల్లో జమ చేయించాడు. ఈ తప్పుడు లావాదేవీలు ఎవరూ గుర్తించకుండా బ్యాంకు ఖాతా వివరాలు బయటకు పొక్కకుండా రికార్డులను చెరిపేసేవాడు. ఇటీవల అమెజాన్‌ అంతర్గత దర్యాప్తు బృందాలు ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలించినప్పుడు కొన్ని అవకతవకలు జరిగినట్లు గుర్తించాయి.

Making Fake Applications AND payments : 50 బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బంతా జమైందని, ఇందులో ఒకే పేరుతో ఎక్కువ ఖాతాలు ఉన్నట్లు అంతర్గత దర్యాప్తు బృందాలు తేల్చాయి. మాజీ ఉద్యోగుల బకాయిల చెల్లింపు కింద నగదు జమ అవుతున్నట్లు నిర్థారణ అయింది. 184 మంది మాజీ ఉద్యోగులకు సెటిల్‌ చేసినా అదే సంఖ్యలో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవ్వకుండా కేవలం 50 ఖాతాలకే మళ్లడంతో మోసం జరిగినట్లు తేలింది. వెంకటేశ్వర్లు తన హోదాను ఉపయోగించి మాజీ ఉద్యోగులు బకాయిల సెటిల్‌మెంటుకు క్లెయిము చేసుకోకున్నా, వారి పేర్లతో నకిలీ దరఖాస్తులు చేయించి చెల్లింపులు చేసినట్లు బయటపడింది.

ICICI Bank Deputy Manager Gold Fraud : బ్యాంకు డిప్యూటీ మేనేజర్​ చేతివాటం.. రూ.8.65 కోట్లు స్వాహా

అంతర్గత విచారణలో వెలుగు చూసిన మోసం : బయటి వ్యక్తులతో కలిసి ఈ సొమ్మంతా పక్కదారి పట్టించారని వెల్లడైంది. ఈ అవకతవకలపై అంతర్గత దర్యాప్తు బృందాలు వెంకటేశ్వర్లును వివరణ కోరే ప్రయత్నం చేస్తున్న సమయంలో హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పాడు. అమెజాన్‌ సంస్థ ప్రతినిధులు అంతర్గతంగా విచారించి మోసం జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచాడు - ఏకంగా రూ.3.26 కోట్లు పక్కదారి పట్టించాడు - Yashoda Employee Fraud in Hyderabad

తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో మాయాజాలం - ప్రైవేట్ గృహానికి ప్రభుత్వ సొమ్ము!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.