KTR Tweet on Allu Arjun Arrest : సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై సినీ ప్రముఖులతో పాటు వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. అరెస్ట్ సమయంలో పోలీసుల తీరును విపక్ష నేతలు ఖండించారు. జాతీయ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తిని ఇలా అరెస్ట్ చేయడం సరిగాలేదని వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘జాతీయ అవార్డు పొందిన ఒక నటుడిని అరెస్టు చేసిన తీరు పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం. ఈ ఘటనలో విఫలమైంది ఎవరు? అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్థుడిలా చూడటం సరికాదు. తొక్కిసలాట ఘటనకు ఆయన నేరుగా బాధ్యుడు కాదు. బన్ని అరెస్టు తీరును ఖండిస్తున్నా, ‘‘అభద్రతాభావం కలిగిన నాయకుడు తన చుట్టూ ఉన్న ప్రజలకు ఎల్లప్పుడూ వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాడు’’- కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Arrest of National Award winning star Allu Arjun is the pinnacle of insecurity of the rulers!
— KTR (@KTRBRS) December 13, 2024
I totally sympathize with the victims of the stampede but who failed really?
Treating @alluarjun Garu as a common criminal is uncalled for especially for something he isn’t directly… pic.twitter.com/S1da96atYa
ఇదే లాజిక్‌తో రేవంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలని.. హైడ్రా వల్ల ఇద్దరి మరణానికి రేవంత్ కారణమయ్యారని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తొక్కిసలాట ఘటనకు అసలు కారకులు, రాష్ట్ర పాలకులేనని, చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అని వ్యాఖ్యానించారు. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలని ఆయన ఎక్స్‌లో ప్రశ్నించారు.
జాతీయ అవార్డు విజేత @alluarjun అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.
— Harish Rao Thanneeru (@BRSHarish) December 13, 2024
అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?
ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు?
సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
దీనికి అసలు కారకులు,…
అరెస్ట్ చేసిన తీరు సరిగాలేదు : అల్లు అర్జున్ అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. జాతీయ అవార్డు గ్రహీత నటుడు అల్లు అర్జున్‌కు సమయం ఇవ్వకుండా నేరుగా తన బెడ్‌రూమ్ నుండి తీసుకెళ్లడం అవమానకరమన్నారు. భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసిన తీరు సరికాదన్నారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం చాలా దురదృష్టకరంమని, కానీ ఇది భారీ జనసందోహాన్ని నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మాత్రమే నొక్కి చెబుతుందని తెలిపారు.
National Award-winning actor Allu Arjun, lifted straight from his bedroom without even being given time to change, is a disgraceful act of mismanagement and disrespect.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 13, 2024
A star of his stature, who brought global recognition to Indian cinema, deserved better treatment.
The tragic…
మరోవైపు, బీజేపీ మరో నేత గోషామహల్ ఎమ్మెల్యే, రాజాసింగ్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘తొక్కిసలాట ఘటన పోలీసు శాఖ వైఫల్యమని ఈ ఘటనలో జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ తప్పు లేదని ట్వీట్ చేశారు. అల్లు అర్జున్‌కి తగిన గౌరవం ఇవ్వాలని నేరస్థుడిగా పరిగణించకూడదని పేర్కొన్నారు.
సాయంత్రం 4 గంటలకు హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్‌పై విచారణ