All Parties Election Campaign in Various Districts : గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీ నేతలు ప్రచారాల జోరు రోజురోజుకు పెంచుతున్నారు. వేసవిని సైతం లెక్కచేయకుండా ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నేతలు నిమగ్నమవుతున్నారు. ఉమ్మడి విజయనగం జిల్లాలో తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్సీపీ అభ్యర్థులు ప్రచార జోరు పోటాపోటీగా సాగుతోంది. ఎస్ కోట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి లలిత కుమారితో కలిసి విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన 100 మందికి భరత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.
కుప్పంలో జోరుగా టీడీపీ ప్రచారం - బాబును లక్షఓట్ల మెజార్టీతో గెలిపిస్తామంటున్న శ్రేణులు
Vijayanagaram: విజయనగరం అభ్యర్థి విజయలక్ష్మి గజపతిరాజు తెలుగు యువతతో సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గజపతినగరం వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య కలిసి దత్తిరాజేరు మండలం దత్తిలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి బేబినాయన కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి, చిన్నఅప్పలనాయుడుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళి, బుచ్చింపేటలో పర్యటించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి తలేరాజేష్ నియోజకవర్గంలోని వాడ వాడా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన అభ్యర్థి సంధ్యారాణి పూసపాటిరేగ మండలంలో విజయయాత్ర నిర్వహించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబుతో కలిసి ఎల్.పి.పాలెంలో ప్రచారం చేశారు.
ఇంటింటికీ సూపర్ సిక్స్ పథకాలు- ప్రకాశంలో టీడీపీ నేతల ప్రచారం
Palnadu: పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం గండిగనుములలో సుగాలి, లంబాడీలతో తెలుగుదేశం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. కార్యాక్రమానికి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్సార్సీపీ నుంచి 30 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. తంగిరాల సౌమ్య వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. కర్నూలు టీీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. బీసీల సాధికారత చంద్రబాబుతోనే సాధ్యమని భరత్ పేర్కొన్నారు.
అనంతపురంలో టీడీపీలోకి చేరికలు: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట ఇంటింటికి ప్రచారం నిర్వహిచారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలయ్యే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం 18వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ మహాలక్ష్మితో పాటు మరో 50 కుటుంబాలు వైఎస్సార్సీపీను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.