Adulterated Food Increasing Hyderabad : హైదరాబాద్ మహానగరంలో ఆహార కల్తీ తీవ్రమైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కల్తీ కేంద్రాల్లో వరుసగా తనిఖీలు చేస్తున్నప్పటికీ కొందరు యజమానులు మాత్రం తమ వైఖరి మార్చుకోవట్లేదు. కుళ్లిన మాంసం, కూరగాయలను వంటలకు వినియోగిస్తున్నారు. వంట గదులను మరీ చెత్తగా నిర్వహిస్తున్నారు. తుప్పు పట్టిన పాత్రల్లో ఆహారం వండి ప్రజారోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగంలోని కొందరు అధికారుల తీరు ఇందుకు ప్రధాన కారణం. యాజమాన్యాలతో కుమ్మక్కై, ప్రయోగశాల నివేదికలను తొక్కిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
![Adulterated Food Increasing Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-10-2024/22712277_food-1.jpg)
చెట్నీస్‌లో చెత్త మెయింటనెన్స్ : కొండాపూర్ శరత్ సిటీ మాల్‌లోని చెట్నీస్ హోటల్‌లో శుక్రవారం రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టింది. ‘‘కంది పప్పు డ్రమ్ములో బొద్దింకలున్నాయి. గోధుమ పిండి, రవ్వకు పురుగులు పట్టి నల్లగా మారాయి. ఫినాయిల్ డబ్బాలను కిరాణ సరకులను ఒకే చోట నిల్వ చేశారు. ఉల్లిపాయలు, క్యాబేజీ గడ్డలు పూర్తిగా కుళ్లిపోయాయి’’ అని టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. అదే మాల్‌లోని అల్పాహార్ టిఫిన్స్ కేంద్రంలో మూతల్లేని చెత్త డబ్బాలు, ఇతర లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
![Adulterated Food Increasing Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-10-2024/22712277_food-2.jpg)
బీ అలెర్ట్ : చికెన్ బాగుందని తింటున్నారా? - అది కుళ్లిపోయింది కూడా కావచ్చు!
90% లోపాలే : తీరిక లేని నగర జీవనంలో చాలా మంది సమయానికి ఇంట్లో తినలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణంగా దగ్గర్లోని హోటల్‌లో లేదా రెస్టారెంట్లలో తిని రోజు గడుపుతుంటారు. దాన్నే ఆసరాగా చేసుకుని యాజమాన్యాలు నాసిరకం సరకులతో, అపరిశుభ్రత, అనారోగ్యకర వాతావరణంలో వంటలను వండుతున్నారు. టాస్క్‌ఫోర్స్ బృందాలు ఇటీవల దాదాపు 500ల చోట్ల తనిఖీలు చేయగా, 90 శాతం కేంద్రాల్లో లోపాలు కనిపించాయి. దాంతో నగరవాసులు బయట తినాలి అంటేనే భయపడుతున్నారు.
![Adulterated Food Increasing Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-10-2024/22712277_food-3.jpg)
పట్టించుకోని బల్దియా : రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం రోజూ హోటళ్లలో తనిఖీ చేస్తోంది. ఓరోజు తర్వాత ఆ హోటల్ లోపాలను ‘ఎక్స్’ వేదికగా వెల్లడిస్తోంది. జీహెచ్‌ఎంసీలో 20 మంది ఆహార భద్రతాధికారులు ఉన్నా ఏడాదికో, ఆర్నెళ్లకో తనిఖీ నివేదికలను ప్రకటిస్తోంది. ఏ రోజు ఏ హోటల్‌ను తనిఖీ చేశారనే విషయాన్ని కనీసం నెలకోసారి కూడా చెప్పడం లేదు. పైగా రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీ చేసిన హోటళ్ల యజమానులతో కొందరు బల్దియా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు చేతులు కలుపుతున్నారని, అందుకే ల్యాబ్ పరీక్షల నివేదికలను బయటపెట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
ఆ హోటల్‌లో షవర్మా తిన్నారా? అయితే మీరు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది!
సమయంతో పోటీ - శ్రమంతా లూటీ - కష్టాల కొలిమిలో ఫుడ్ డెలివరీ బాయ్స్ - Problems Of Food Delivery Boy