ETV Bharat / state

కుళ్లిన మాంసం కొవ్వుతో వంట నూనె - ఎసిటిక్‌ యాసిడ్‌తో పాలు - సిట్రిక్‌ యాసిడ్​తో అల్లం పేస్ట్!

కల్తీ ఆహారాలకు అడ్డాగా మారుతున్న హైదరాబాద్‌ - ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా లాభాల కోసం దందా

Adulterated Food is Increasing in Telangana
Adulterated Food is Increasing in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Adulterated Food is Increasing in Telangana : ఘాటు వాసన వచ్చేందుకు సిట్రిక్‌ యాసిడ్​తో అల్లం వెల్లుల్లి పేస్ట్, తెల్లగా చిక్కగా కనిపించేందుకు వనస్పతి డాల్డా, ఎసిటిక్‌ యాసిడ్‌తో పాలు, కుళ్లిన మాంసం కొవ్వుతో వంట నూనె, నెయ్యి. ఇదీ నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ కోసం కొందరు నేరగాళ్లు అనుసరిస్తున్న దారుణాలు. ఒళ్లుగగుర్పొడిచే రీతిలో ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు ఆహార భద్రతా విభాగం, టాస్క్‌ఫోర్స్‌, ఎస్వోటీ పోలీసుల తనిఖీల్లో ఎప్పటికప్పుడు వెలుగుచూస్తున్నా పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడకపోవడానికి ప్రధానం కారణం కోరల్లేని చట్టాలే. నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా కఠిన శిక్షల్లేకపోవడం కేసులు శిక్షణ వరకూ వెళ్లడం లేదు. ఇదే అవకాశంగా నగరంలో కల్తీ ముఠాలు అడ్డుగోలుగా రెచ్చిపోతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

నగరంలో కల్తీ ఆహారం ఎక్కడ పట్టుబడ్డా, భారతీయ న్యాయ సంహితలోని 274, 275 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఆహారాన్ని కల్తీ చేయడంతో పాటు దాన్ని విక్రయిస్తున్నందుకు ఈ సెక్షన్లు ప్రయోగిస్తున్నారు. ఈ సెక్షన్లు ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష, లేదా రూ.5వేల జరిమానా లేదా ఒకేసారి ఈ రెండూ విధించే అవకాశముంది. ఈ తరహా కేసుల్లో నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించే అవకాశముండదు. నోటీసులిచ్చి పంపించాల్సి వస్తోంది. కల్తీ దందాతో రూ.కోట్లు ఆర్జిస్తున్న కేటుగాళ్లపై ఇలాంటి సాధారణ సెక్షన్లు ప్రయోగించడంతో వారిలో ఏ మాత్రం భయంలేకుండపోతోంది.

తక్కువ ధరకే వస్తున్నాయని ఎక్కడపడితే అక్కడ ఆహార పదార్థాలు కొంటున్నారా? - మీరు రిస్క్​లో పడినట్లే!

మార్పు రాదు : కల్తీ ఉత్పత్తుల తయారీతో పాటు వాటిని విక్రయించి ప్రజల్ని మోసం చేస్తున్నారనే కోణంలో కొన్నిసార్లు బీఎన్‌ఎస్‌ 318(4)(ఐపీసీ ప్రకారం 420), నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలను ముప్పు తెస్తున్నారనే కారణంతో 125 సెక్షన్లు నమోదు చేస్తున్నారు. ఏడేళ్లలోపు శిక్షలుండే చట్టాల కింద అరెస్టయిన కేసుల్లో అరెస్టు చేయడానికి వీల్లేదు. ఇదే అవకాశంగా నేరగాళ్లు మళ్లీ మళ్లీ కల్తీ దందా మొదలుపెడుతున్నారు.

ఉదాహరణకు ఇటీవల సౌత్‌వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు లంగర్‌హౌస్‌లో సిట్రిక్‌ యాసిడ్‌తో కల్తీ అల్లం పేస్టు తయారు చేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇమ్రాన్‌ సలీమ్‌ గతంలో కల్తీ ఆహార పదార్థాలు తయారుచేస్తూ మూడుసార్లు పోలీసులకు చిక్కాడు. అయినా భయం లేకుండా నాలుగోసారి చీకటి దందా చేస్తూ పట్టుబడ్డాడు.

నామవాస్తవంగా చట్టం అమలు : ఆహార కల్తీ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత, ప్రమాణాల చట్టం- 2006ను తీసుకొచ్చింది. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగం తదితర అంశాలకు సంబంధించిన ప్రమాణాలను ఇది చూస్తోంది. ఆహార భద్రతా విభాగం ఈ చట్టం అమలును పర్యవేక్షించాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో జరగడం లేదు.

కొన్నిసార్లు ఫలానా ప్రాంతంలో ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందుకుని సోదాలు చేస్తున్నారు. ఆ తర్వాతే ఆహార భద్రతా విభాగం అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. సంబంధిత అధికారులు నిత్యం తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ దిశగా దృష్టి సారించకపోవడం ఓ సమస్యగా మారుతోంది. ఆహార పదార్థాల కల్తీ ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోందని, ఇలాంటి కేసుల్లో పట్టుబడినప్పుడు నిందితులపై కఠినంగా వ్యవహారించేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రోడ్​ సైడ్​ బండ్ల వద్ద చిరుతిండ్లు తింటున్నారా? - వాటి తయారీ గురించి తెలిస్తే ఆవైపు కూడా వెళ్లరు!

టేస్టీగా, టెంప్టింగ్​గా ఉందని బయట తింటున్నారా? - ఆ టేస్ట్ అంతా 'కల్తీ' అంట! జర చూస్కోండి మరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.