Adilabad Lok Sabha Polls 2024 : పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాకముందే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం అనూహ్యా పరిణామాలకు దారి తీస్తోంది. బీఆర్ఎస్కు చెందిన ఆదిలాబాద్, మంచిర్యాల జడ్పీఛైర్మెన్లు జనార్దన్ రాఠోడ్, నల్లాల ఓదెలు దంపతులు ఇప్పటికే పార్టీని వీడగా, తాజాగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సోదరుడైన ఆసిఫాబాద్ ఇన్‌ఛార్జీ జడ్పీఛైర్మన్ కోనేరు కృష్ణారావు ఈనెల 14న కాంగ్రెస్‌లో చేరడానికి ముహుర్తం ఖరారైంది. బీఆర్ఎస్ నుంచి బోథ్ ఎమ్మెల్యే టికెట్, ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ గోడం నగేష్ ఆదివారం బీజేపీలో చేరారు.
మరోపక్క కీలకనేత, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి (BRS Leader Indrakaran Reddy) , ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరడానికి అంతర్గతంగా మంతనాలు జరుగుతుండటం బీఆర్ఎస్ రాజకీయ ప్రభవాన్ని మసకబారేలా చేస్తోంది. ప్రధానంగా ఎన్నికల పార్టీ ముఖ్య నేతలు కాంగ్రెస్, బీజేపీతో మంతనాలు జరుపుతుండడంతో బీఆర్ఎస్పై చాలా ప్రభావం పడే అవకాశం ఉంది.
BJP Leaders Focus on Adilabad MP Seat : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ కీలకనేతల బృందం హుటాహుటిన సోమవారం దిల్లీబాట పట్టారు. బీఆర్ఎస్ (BRS) నుంచి వచ్చిన గోడం నగేష్‌కు టికెట్ ఇవ్వొద్దని పార్టీ సీనియర్‌నేత బీఎల్ సంతోష్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ సహా ఇతర కీలకనేతలను కలవడం కలకలం రేకెత్తిస్తోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అప్పటి ఎంపీగా ఉన్న గోడం నగేష్ భైంసా మున్సిపాల్టీ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎంఐఎంకి ఓటేశారని బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకురావడం ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓడితేనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయి : హరీశ్‌రావు
ఓ దశలో గోడం నగేష్ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారవుతుందనుకుంటున్న తరుణంలో అనూహ్యం పరిణామం చోటుచేసుకోవడం కలకలం రేకెత్తిస్తోంది. ఎంపీగా నగేష్ అభ్యర్థిత్వాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బలపరుస్తుంటే, అదే పార్టీకి చెందిన బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఒకే పార్టీకి చెందిన నేతలు సీటు గురించి ఒకే వ్యక్తిపై భిన్నాభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. దీంతో సీటు ఖరారు విషయం దిల్లీ చేరింది.
Congress on Lok Sabha Election Plan 2024 : బీజేపీ, బీఆర్ఎస్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ (Congress) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా డబుల్ డిజిట్ దిశగా హస్తం నేతలు వ్యూహాన్ని రచిస్తున్నారు. శాసనసభ ఎన్నికల ముందు దూరమైన శ్రేణులతోపాటు బీఆర్ఎస్లోని కీలకనేతలను పార్టీలో చేర్చుకోవడానికి (Congress Joinings) పావులు కదుపుతూనే బలాన్ని పెంచుకునే ప్రణాళికతో ముందుకెళ్తోంది.
తెలంగాణలో ఎన్నికల ప్రచార స్పీడు పెంచిన బీజేపీ - అమిత్ షా రాకతో కొత్త జోష్!
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు ముమ్మరం - కొనసాగుతోన్న ఫ్లాష్ సర్వేలు