ETV Bharat / state

ఏపీ సీఎం చంద్రబాబుతో అదానీ భేటీ - ముఖ్యమైన ప్రతిపాదనలివే - ADANI GROUP INVESTMENTS IN AP

ఏపీలో అభివృద్ధి పనుల కోసం అదానీ గ్రూప్‌ భారీ పెట్టుబడులు - ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్‌ ప్రతినిధుల భేటీ

ADANI GROUP INVESTMENTS IN AP
Adani Group Investments In AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 1:24 PM IST

Adani Group Investments In AP : ఏపీలో అభివృద్ధి పనుల కోసం అదానీ గ్రూప్‌ భారీ పెట్టుబడులు పెట్టింది. డేటా సెంటర్లు, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, గనులు, పోర్టులు, కృత్రిమ మేధ (ఏఐ), ఐటీ, పర్యాటకం వంటి రంగాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. స్వర్ణాంధ్ర సాధన, రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సంసిద్ధత తెలియజేసింది. అదానీ గ్రూప్‌ ఎండీ రాజేష్‌ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్‌లు, సిమెంట్స్‌ విభాగం ఎండీ కరణ్‌ అదానీ సహా అదానీ గ్రూప్‌ నుంచి భారీ బృందం రాష్ట్రానికి తరలి వచ్చారు.

సోమవారం సీఎం చంద్రబాబుతో సమావేశమైన అదానీ గ్రూప్‌ ప్రతినిధులు రాష్ట్రంలో తమ గ్రూప్‌ పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను గురించి తెలిపారు. ఏయే రంగాల్లో అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయో, వాటిలో తాము ఏ మేరకు తాము పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామో, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరమో వెల్లడించారు. అదానీ గ్రూప్‌ చేసిన ప్రతిపాదనల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టుల్ని అమలు చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.

చంద్రబాబును కలిసిన వారిలో అదానీ పోర్ట్స్‌ సీఈఓ ప్రణయ్‌ చౌదరి, అదానీ థర్మల్‌ బిజినెస్‌ సీఈఓ ఎస్‌.బి.ఖ్యాలియా, బీచ్‌ శాండ్‌ బిజినెస్‌ సీఈఓ రాజేంద్రసింగ్, అదానీ పవర్‌ బిజినెస్‌ హెడ్‌ రాజ్‌కుమార్‌ జైన్, అదానీ గ్రూప్‌ ఐటీ హెడ్, ఛైర్మన్‌ సలహాదారు సుదీప్త భట్టాచార్య, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కార్పొరేట్‌ వ్యవహార హెడ్‌ పి.అంజిరెడ్డి కూడా ఉన్నారు. అదానీ గ్రూప్‌ ప్రతిపాదించిన ప్రాజెక్టులు సాకారమైతే రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు తీస్తుంది. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఐటీ వంటి రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్లేందుకు దోహదం చేస్తుంది.

"అదానీ గ్రూప్‌ ప్రతినిధులతో ఈరోజు విస్తృత చర్చలు జరిగాయి. పోర్టులు, గనులు, రింగ్‌రోడ్డు, ఐటీ, పర్యాటకం వంటి రంగాల్లో పెట్టుబడులకు వారు ఆసక్తి కనబరిచారు. అమరావతి నిర్మాణం, స్వర్ణాంధ్ర సాకారానికి తోడ్పడతామని తెలిపారు." - చంద్రబాబు, సీఎం

ఏపీ పెట్టుబడులపై అదానీ గ్రూప్‌ ముఖ్యమైన ప్రతిపాదనలు : రాజధాని ఇన్నర్‌రింగ్‌ రోడ్డు రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఇది వరకే సిద్ధం చేసిన ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌లో అవసరమైతే కొన్ని మార్పులు చేసి, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధత చేస్తుంది. గతంలో ఏపీ ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్‌కు తగ్గట్టే ఐఆర్‌ఆర్‌ని ఫేజ్‌-1, ఫేజ్‌-2లుగా నిర్మించే ప్రతిపాదన.

బీచ్‌శాండ్ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టులు : బీచ్‌శాండ్‌ మైనింగ్, శుద్ధి వంటి పనులు చేస్తుంది. తొలి దశలో రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు ప్రత్యక్షంగా 2 వేల మందికి, పరోక్షంగా 4, 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. ప్రత్యక్షంగా 4 వేల మంది, పరోక్షంగా 8 వేల నుంచి 10 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ప్రభుత్వానికి 30 ఏళ్లకు రూ.10 వేల కోట్లు ఆదాయం వస్తుంది.

విదేశీమారకద్రవ్యం ఆదా : టైటానియం డయాక్సైడ్‌ దిగుమతిని తగ్గించుకోవడం ద్వారా రూ.9 వేల కోట్లు విదేశీమారకద్రవ్యం ఆదాఅవుతుంది. ప్రాజెక్టు, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఆతిథ్య రంగం, మౌలిక వసతుల కల్పన, విద్యాకేంద్రాలు, వర్క్‌షాప్‌ల ఏర్పాటు. శ్రీకాకుళం, భీమునిపట్నం ప్రాజెక్టు ఏర్పాట్లు చేస్తారు. ఆర్‌ఓఎం శాండ్, డీస్లిమ్డ్‌ శాండ్, హెవీ మినరల్‌ ఉత్పత్తి చేస్తుంది. 1,034 హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది. 19 మిలియన్‌ లీటర్ల నీటి అవసరం ఉంటుంది. 0.12 మెగావాట్లు, 0.55 మెగావాట్లు, 6.83 మెగావాట్లు, 8 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల వారీగా అవసరం ఉంటుంది.

ప్రాధాన్య రంగంగా గుర్తించాలి.. ప్రత్యేక రాయితీలివ్వాలి

  • బీచ్‌శాండ్‌ ఖనిజ పరిశ్రమను ప్రాధాన్య రంగంగా గుర్తించాలి.
  • పారిశ్రామిక రాయితీలు: 100 శాతం ఎస్‌జీఎస్టీ, వ్యాట్‌ రీయింబర్స్‌మెంట్, పెద్ద పరిశ్రమగా గుర్తించి పదేళ్లపాటు విద్యుత్తు సుంకంపై 100% మినహాయింపు, టైటానియం డయాక్సైడ్‌ ప్రాజెక్టుకు అధిక ఇంధన వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో అభివృద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తులకు ఉన్న అవకాశాలకు అనుగుణంగా విద్యుత్తు రాయితీ, ప్రాజెక్టును పదేళ్లు విజయవంతంగా అమలు చేశాక.. భూమి కొనుగోలు ఎంపిక అవకాశం, స్థిర మూలధన పెట్టుబడి (ఎఫ్‌సీఐ) రాయితీ, టర్మ్‌ రుణాలపై పదేళ్లపాటు వడ్డీ రాయితీ, పెట్టుబడి వ్యవధికి వంద శాతం స్టాంపు రుసుము మినహాయింపు, ఇళ్లకు ఉచితంగా నీరు, విద్యుత్తు సరఫరా ఏర్పాట్లు, దిగుమతి చేసుకునే పరికరాలపై కస్టమ్‌ సుంకం రద్దు/ రీయింబర్స్‌మెంట్‌
  • బీచ్‌శాండ్‌ పరిశ్రమలో అవసరమైన భూమికి మినహాయింపులు కల్పించడంపై ప్రత్యేక విధానం.

కృష్ణపట్నం, గంగవరం పోర్టుల విస్తరణ

  • కృష్ణపట్నం పోర్టు సామర్థ్యం 78 మిలియన్‌ టన్నుల నుంచి 330 మిలియన్‌ టన్నులకు, బెర్తుల సంఖ్య 13 నుంచి 42కి పెంపు.
  • పోర్టు విస్తరణకు మరో 2,189.86 ఎకరాలు అవసరం. 1,033 ఎకరాల అటవీ భూమికి తొలిదశ అటవీ పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. 775 ఎకరాల ఉప్పు భూముల కోసం ఏపీ మారిటైం బోర్డుకు ప్రతిపాదన వెళ్లింది. డీపీఐఐటీతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించాలి. దేవాదాయ భూములు 289.69 ఎకరాలకు సంబంధించి హైకోర్టులో వివాదాన్ని పరిష్కరించాల్సి ఉంది.
  • గంగవరం పోర్టు సామర్థ్యం 64 మిలియన్‌ టన్నుల నుంచి 200 మిలియన్‌ టన్నులకు పెంపు. 2022లో గంగవరం పోర్టు లిమిటెడ్‌ సేకరించిన భూముల్ని ఆ పేరుతో ఉండేలా భూమి రికార్డులను మార్చాలి. గతంలో కేటాయించిన 1,800 ఎకరాల్లో ఇంకా పెండింగ్‌లో ఉన్న 217.57 ఎకరాలు మాకు అప్పగించాలి.
  • ఏపీఐఐసీ ద్వారా 5 వేల ఎకరాల నుంచి 20 వేల ఎకరాలు కేటాయించి పారిశ్రామిక రాయితీలు కల్పిస్తే దేశంలోనే అతి పెద్ద పోర్టుల ఆధారిత పారిశ్రామిక పార్కుల విస్తరణకు అవకాశం.

విశాఖలో 10 కోట్ల లీటర్ల డీశాలినేషన్‌ ప్లాంట్‌

విశాఖలో సముద్రపు నీటి నుంచి రోజుకు 10 కోట్ల (100 మిలియన్‌) లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేసే డీశాలినేషన్‌ ప్లాంట్‌. అప్పికొండ బీచ్‌ దీనికి అనుకూలం. రూ.800 కోట్ల పెట్టుబడి. సముద్రపు నీటిని రివర్స్‌ ఆస్మాసిస్‌ విధానంలో శుద్ధి చేసే టెక్నాలజీని ఉపయోగించి మంచి నీటి ఉత్పత్తి. ప్లాంట్‌ నిర్వహణకు గ్రీన్‌ ఎనర్జీ వినియోగం. డీబీఎఫ్‌ఓటీ విధానంలో ఏర్పాటు.

విద్యుత్‌ రంగంలో...

  • 1600 మెగావాట్ల థర్మల్‌ ప్రాజెక్టు, 4 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు
  • ఏటా పెరిగే విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా 2032 నాటికి 9,013 మెగావాట్లు అదనంగా అవసరం ఉంటుందని ఆ విద్యుత్‌ను భర్తీ చేసేందుకు 4 వేల మెగావాట్ల సౌర, 4 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

రియల్ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్‌-5 టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!

రోజుకు రూ.100 పెట్టుబడితో రూ.5 కోట్ల నిధి - ఈ MF ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ గురించి మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.