ETV Bharat / state

పవన్‌ VS ప్రకాశ్‌రాజ్ : 'ఈ నెల 30 తర్వాత మీ ప్రతి ప్రశ్నకూ జవాబిస్తా' - Prakashraj Reply to Pawan Kalyan

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Prakashraj Reply to Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. తాను చెప్పిన విషయాన్ని పవన్‌ అపార్థం చేసుకున్నారని, ఈ నెల 30 తర్వాత వచ్చి పవన్ ప్రతి ప్రశ్నకు జవాబిస్తానని స్పష్టం చేశారు.

Prakashraj
Prakashraj Reply to Pawan Kalyan (ETV Bharat)

Prakashraj Reaction on Pawan Kalyan Comments : సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ప్రకాశ్‌రాజ్‌ తెలుసుకుని మాట్లాడాలని, సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. తాను చెప్పిన విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ అపార్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను విదేశాల్లో సినిమా షూటింగ్‌లో ఉన్నానని, ఈ నెల 30 తర్వాత వచ్చి పవన్ ప్రతి ప్రశ్నకు జవాబిస్తానన్నారు. తన ట్వీట్‌ను మళ్లీ చదివి అర్థం చేసుకోవాలని కోరుతున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.

నేను చెప్పిన విషయాన్ని పవన్‌ అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో సినిమా చిత్రీకరణలో ఉన్నాను. ఈ నెల 30 తర్వాత వచ్చి, పవన్ ప్రతి ప్రశ్నకు జవాబిస్తాను. నా ట్వీట్ మళ్లీ చదివి అర్థం చేసుకోవాలని కోరుతున్నా. - నటుడు ప్రకాశ్‌రాజ్‌

అసలు ఏం జరిగిందంటే? తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ భక్తులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ పవన్‌కల్యాణ్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. 'మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. విచారణ చేపట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోండి. భక్తులకు అనవసర భయాలు కల్పించి, దీనిని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా ఎందుకు చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు.' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

తెలుసుకుని మాట్లాడండి : ఈ ట్వీట్‌పై తాజాగా పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో మాట్లాడిన ఆయన సున్నితాంశాలపై ప్రకాశ్‌రాజ్‌ తెలుసుకుని మాట్లాడాలని పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్‌తో పాటు అందరికీ చెబుతున్నానని, విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్‌ వ్యాఖ్యానించారు.

సారీ చెప్పిన కార్తీ : తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో వస్తోన్న విమర్శల నేపథ్యంలో తాజాగా నటుడు కార్తీ చేసిన కామెంట్స్​పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. విషయం తెలుసుకున్న కార్తీ తాజాగా పవన్​కు సారీ చెప్పారు. 'పవన్‌ కల్యాణ్‌పై నాకు ఎంతో గౌరవం ఉంది. నా వ్యాఖ్యలు అనుకోని అపార్థానికి దారి తీసినందుకు క్షమాపణ కోరుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడినే. ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను" అంటూ కార్తీ క్షమాపణలు కోరారు.

'లడ్డు' కామెంట్స్​పై పవన్ అసంతృప్తి - సారీ చెప్పిన కార్తి! ఏమైందంటే? - Karthi Pawan Laddu controversy

సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ : ఏపీ డిప్యూటీ సీఎం హెచ్చరిక​​ - Pawan Kalyan on Sanatana Dharma

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.