ETV Bharat / state

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలు చట్టవిరుద్ధం - న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం : హీరో నాగార్జున - Nagarjuna Reaction On N Convention - NAGARJUNA REACTION ON N CONVENTION

Actor Nagarjuna Reaction On N Convention Demolish : ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై సినీ హీరో నాగార్జున స్పందించారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్టే ఆర్డర్‌లు ఉన్నా, కూల్చివేత చేపట్టడం బాధాకరమన్నారు.

Actor Nagarjuna Reaction On N Convention Demolish
Actor Nagarjuna Reaction On N Convention Demolish (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 1:03 PM IST

Updated : Aug 24, 2024, 2:34 PM IST

Actor Nagarjuna Reaction On N Convention Demolish : మాదాపూర్​లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై సినీ హీరో నాగార్జున స్పందించారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్టే ఆర్డర్‌లు ఉన్నా, ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత చేపట్టడం బాధాకరమన్నారు. అధికారులు చట్టవిరుద్ధంగా తీసుకున్న చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హీరో నాగార్జున తెలిపారు. ఉదయం కూల్చివేతకు ముందు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

చట్టాన్ని ఉల్లంఘించేలా తాను ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. తమది పట్టా భూమి అన్న ఆయన, ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని వివరించారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టు స్టే ఇచ్చిందని నాగార్జున గుర్తు చేశారు. కేసు న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం : తప్పుడు సమాచారంతో చట్ట విరుద్ధంగా ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేశారని నాగార్జున ఆరోపించారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరుడినన్న ఆయన, కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే తామే కూల్చివేసే వారిమని అన్నారు. తాజా పరిణామాలతో ప్రజలకు తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'మేం ఆక్రమణలు చేశామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. చట్ట విరుద్ధ చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం' అని నాగార్జున స్పష్టం చేశారు.

"ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని"- సినీ హీరో నాగార్జున ట్వీట్

హీరో నాగార్జునకు 'హైడ్రా' షాక్ - మాదాపూర్​లోని ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేత - Madhapur N Convention Demolish

Last Updated : Aug 24, 2024, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.