ETV Bharat / state

మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మమ్మల్ని వాడుకోవద్దు - మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున అసహనం - Nagarjuna On Konda Surekha Comments - NAGARJUNA ON KONDA SUREKHA COMMENTS

Actor Nagarjuna Condemns Minister Konda Surekha Comments : తమ కుటుంబం పట్ల మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. సమంత, నాగచైతన్య విడిపోవటం పట్ల, మంత్రి మాట్లాడిన మాటలు పూర్తిగా అసంబద్ధమని, తక్షణమే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నాగార్జున కోరారు.

Actor Nagarjuna Condemns Minister Konda Surekha Comments
Actor Nagarjuna Condemns Minister Konda Surekha Comments (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2024, 5:41 PM IST

Updated : Oct 2, 2024, 6:45 PM IST

Actor Nagarjuna Condemns Minister Konda Surekha Comments : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ నటుడు నాగార్జున తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్ధులను విమర్శించేందుకు వాడుకోవద్దని కోరారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళగా మా కుటుంబంపై చేసిన ఆరోపణన పూర్తిగా అబద్దమని నాగార్జున తెలిపారు. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని నాగార్జున కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

"గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖగారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను." - సినీ నటుడు నాగార్జున ట్వీట్​

ఇంతకీ మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే : బీసీ మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆరే ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు ఉందన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తీరుతో చలనచిత్ర పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని అన్నారు. కొందరు హీరోయిన్లు త్వరగా మ్యారేజ్​ చేసుకుని సినిమా ఫీల్డ్‌ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా మాజీ మంత్రి కేటీఆర్‌ అని ఆరోపించారు. అంతేకాదు, అక్కినేని నాగార్జున కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కూడా కేటీఆర్‌ కారణమని ప్రస్తావించారు.

కేటీఆర్‌ మత్తు పదార్థాలకు అలవాటు పడి, సినిమా వాళ్లకు కూడా వాటిని అలవాటు చేశారని తీవ్రంగా మంత్రి సురేఖ విమర్శించారు. రేవ్‌ పార్టీలు చేయడంతో పాటు, సినీతారలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి కేటీఆర్‌ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది సినీ పరిశ్రమలో ఉన్న వారందరికీ తెలుసని పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రెజెంట్​ సోషల్​ మీడియా వేదికగా ట్రెండ్‌ అయ్యాయి. మరోవైపు మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా మండిపడ్డారు. "సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా..?" అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ : కొండా సురేఖ - Konda Surekha Fires On KTR

హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఎలా అంటారు - మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్​ - KTR Fire On Konda Surekha Comments

Last Updated : Oct 2, 2024, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.