ETV Bharat / state

వసతులున్నా, వైద్యులేరీ? - అచ్చంపేట ఏరియా ఆసుపత్రి దుస్థితిపై ప్రత్యేక కథనం

Achampet Govt Hospital problems : కొత్తగా నిర్మించిన భవనం ఉంది. కావాల్సిన వసతులున్నాయి. ఆధునిక వైద్య పరికరాలూ అందుబాటులో ఉన్నాయి. కానీ రోగులకు మాత్రం ఆ స్థాయి వైద్యసేవలు అందట్లేదు. అత్యవసర కేసులొస్తే రోగులను అప్పటికప్పుడు పైఆసుపత్రులకు సిఫార్సు చేయడమే తప్ప, అక్కడి వైద్యులు చేసేదేమీ ఉండదు. నిత్యం 300 నుంచి 500 మంది రోగులు, 100 మంది ఇన్‌పేషెంట్లకు వైద్య సేవలందించే అచ్చంపేట ఏరియాసుపత్రి దుస్థితిపై కథనం.

Hospital Problems In Nagarkurnool district
Achampet Govt Hospital problems
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 10:13 AM IST

వసతులున్నా, వైద్యులేరీ? - అచ్చంపేట ఏరియా ఆసుపత్రి దుస్థితిపై ప్రత్యేక కథనం

Achampet Govt Hospital problems : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రాంతీయ ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ ఆసుపత్రికి నిత్యం 300 నుంచి 500 మంది రోగులు వచ్చి వెళ్తుంటారు. గతంలో 30 పడకలు ఉండగా, ఉన్నతీకరిస్తూ 100 పడకల ఏరియా ఆసుపత్రిగా మార్చారు. కానీ కావాల్సిన వైద్యులు, సిబ్బందిని ప్రభుత్వం నియమించలేకపోయింది. రూ.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఆ ఏరియా ఆసుపత్రిని గతేడాది మేలో అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

Govt Hospital Problems : ఆ దవాఖానాకు వెళ్లాలంటేనే జంకుతున్న జనాలు.. వైద్యులదీ అదే పరిస్థితి!

Hospital Problems In Nagarkurnool district : భవన సదుపాయం, వైద్య పరికరాలున్నా,సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది లేరు. వైద్యుల కొరత కారణంగా జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, ప్రసూతి, చిన్న పిల్లలు సహా వివిధ రకాల వైద్య విభాగాల సేవలు అరకొరగా అందుతున్నాయి. ఉన్న సిబ్బందితోనే మెరుగైన సేవలు అందించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.

రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన పరికరాలు ఉన్నా, టెక్నీషియన్లు లేకపోవడంతో కొన్ని రకాల పరీక్షల కోసం రోగుల్ని బయటకు పంపాల్సిన పరిస్థితి. స్కానింగ్ సౌకర్యం ఉన్నా, అందుకు అవసరమైన నిపుణులు లేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వైద్యులు గర్భిణీలకు గైనకాలజిస్టులు స్కానింగ్ చేస్తున్నారు. సర్కారీ దవాఖానాకు వచ్చినా ఖర్చు తప్పకపోవడంపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

''డబ్బులు లేక గవర్నమెంట్ ఆస్పత్రికి వస్తే టెస్టులు చేయడానికి సిబ్బంది లేరని, బయట చేయించుకోవాలని అంటున్నారు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరుగు దొడ్ల తలుపులకు తాళాలు వేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఇక్కడ సమస్యలు పరిష్కరించాలి '' -రోగులు

Seasonal Diseases in Telangana : వాతావరణంలో మార్పులు.. జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు

Govt Hospital Problems : మంచి నీటి వసతి సహా పలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నా, వచ్చే రోగులకు సరిపోవట్లేదు. రెండో అంతస్తులో మహిళ, గర్భిణీ వార్డుల్లో మరుగుదొడ్లు మూసేశారు. మూడో అంతస్థులోని మహిళ, పురుషుల మరుగు దొడ్ల తలుపులకు తాళాలు వేశారు. పైన పటారం, లోన లొటారం అన్నట్లుగా చూడ్డానికి బయటకు అందమైన భవనం కనిపిస్తున్నా, లోపల సరైన వసతులు లేకపోవడంపై రోగులు పెదవి విరుస్తున్నారు. రోగులకు దూరం, ఆర్థిక భారాన్ని తగ్గించాలంటే అచ్చంపేటలో సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

వైద్యులు, సిబ్బంది కొరత ఉన్న మాటవాస్తవన్న సూపరింటెండెంట్, ఉన్న సిబ్బందితోనే మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పడం విడ్డూరం. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవలే అచ్చంపేట ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. సమస్యలను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీలైనంత త్వరగా పరిష్కరించాలని, అక్కడి రోగులు సహా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇల్లందు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరత - అవస్థలు పడుతున్న రోగులు

హాస్పిటల్​లో బాంబు పెట్టామంటూ ఈ-మెయిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.