Accident Insurance For TSRTC Employees is Increased : తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ ఉద్యోగుల ప్రమాద బీమా (Accident Insurance) పెంపుపై ఆ సంస్థ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం రూ.40లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రమాద బీమా పెరిగిందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్లోని బస్ భవన్లో ప్రమాద బీమా పెంపుపై సజ్జనార్ (TSRTC MD Sajjanar), యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావులు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.
-
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 20, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
రూ.1.12 కోట్ల వరకు బీమా వర్తింపు.. యూబీఐతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం https://t.co/whN9guLITE pic.twitter.com/jzyw9PkPS1
">టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 20, 2024
రూ.1.12 కోట్ల వరకు బీమా వర్తింపు.. యూబీఐతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం https://t.co/whN9guLITE pic.twitter.com/jzyw9PkPS1టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 20, 2024
రూ.1.12 కోట్ల వరకు బీమా వర్తింపు.. యూబీఐతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం https://t.co/whN9guLITE pic.twitter.com/jzyw9PkPS1
సంక్రాంతి వేళ టీఎస్ఆర్టీసీకి కాసుల పంట - ఒక్కరోజే రూ.12 కోట్ల ఆదాయం
ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Union Bank of Inida) సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ (యూఎస్ఎస్ఏ) కింద రూ.కోటి ప్రమాద బీమాను అందించనున్నారు. రూపే కార్డు ద్వారా మరో రూ.12లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండా రూ.1.12కోట్ల వరకు ప్రమాద బీమాను యూబీఐ సహాకారంలతో బాధిత కుటుంబాలకు సంస్థ అందించనుంది. ఫిభ్రవరి 1వ తేదీ నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి వస్తుందని తెలిపింది.
TSRTC Employess Accident Insurance Increased From Rs.40Lakhs to Rs.1crore : ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా రూ.1.12కోట్ల వరకు ప్రమాద బీమాను పెంచడం శుభపరిణామం అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందినవారికి, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రమాద బీమాను పెంచాలని కోరగానే అంగీకరించిన యూబీఐ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు అంశాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారని, ఇది సిబ్బందికి ఎంతో మేలు చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారని వెల్లడించారు. దీనిపై ఆర్టీసీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు
అటు రైళ్లు, ఇటు ఆర్టీసీ బస్సులు అన్నీ ఫుల్ - అంతంత రేట్లు పెట్టి సంక్రాంతికి పోయేదెట్టా!