ETV Bharat / state

క్వారీలో ప్రమాదం - ముగ్గురు కార్మికుల దుర్మరణం - Accident in Quarry Several Dead

Accident in Quarry Several Dead : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పరిటాల క్వారీలో ఘోర ప్రమాదం సంభవించి ముగ్గురు దుర్మరణం చెందారు. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ పెద్ద మొత్తంలో జారి డ్రిల్లింగ్ చేస్తున్న కార్మికులపై పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బోల్డర్స్, పెద్ద పెద్ద రాళ్ల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకోగా, మరో ముగ్గురి ఆచూకీ తెలియరాలేదు. దీంతో వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు చేపట్టారు.

Quarry Accident in AP
Accident in Quarry Several Dead (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 3:32 PM IST

Updated : Jul 15, 2024, 10:21 PM IST

Accident in Quarry Several Dead : ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో విషాదం చోటుచేసుకుంది. క్వారీలో లూజు బోల్డర్స్‌ జారి డ్రిల్‌ చేస్తున్న కార్మికులపై పడ్డాయి. దీంతో బోల్డర్స్‌, పెద్ద పెద్ద బండరాళ్ల కింద చిక్కుకుని ముగ్గురు కార్మికులు మృతిచెందారు. రాళ్ల కింద చిక్కుకున్న మరో కార్మికుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.

మృతులు జి.కొండూరు మండలం చెరువు మాధవవరానికి చెందిన దుర్గారావుతోపాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాందేవ్‌, ఒడిశాకు చెందిన బీబీ నాయక్‌గా గుర్తించారు. ఉదయాన్నే పనికి వెళ్లినవారు విగతజీవులుగా మారడంతో మృతుల కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. క్వారీ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాల్ని ఆదుకోవాలని బాధితులు, సహచర సిబ్బంది, చెరువు మాధవవరం గ్రామస్థులు కోరుతున్నారు.

పరిటాల క్వారీలో ప్రమాదం : సహాయక సిబ్బంది కొండ శకలాలను తొలగించి మొదట ఒక మృతదేహాన్ని వెలికితీశారు. వర్షం కురుస్తుండటంతో మరో రెండు మృతదేహాలను తీసేందుకు ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ పోలీసు, రెవెన్యూ అధికారులు వర్షంలోనే సహాయ కార్యక్రమాలు కొనసాగించి మిగిలిన మృతదేహాల్ని బయటకు తీశారు.

డీసీఎంను ఢీకొట్టిన ఆర్టీసీ లగ్జరీ బస్సు - మంటలు చెలరేగి చూస్తుండగానే దగ్దం - ప్యాసింజర్స్​ సేఫ్ - BUS Fire Accident In Mahabubnagar

అందుకే ఫోన్​ మాట్లాడుతూ రోడ్డు దాటొద్దు అనేది - కారు ఢీకొని యువకుడి మృతి - వీడియో వైరల్ - Road Accident In Medchal District

Last Updated : Jul 15, 2024, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.