ETV Bharat / state

హెచ్ఎండీఏ డైరెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు - హెచ్ఎండీఏ డైరెక్టర్‌ ఇంట్లో ఏసీబీ

ACB Raids in HMDA Planning Director House : హెచ్ఎండీఏ టౌన్‌ ప్లానింగ్ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై తనిఖీలు చేయగా, రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. రెరా కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శివబాలకృష్ణ, అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ACB Searches in TS RERA Secretary House
ACB Raids in HMDA Planning Director House
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 4:37 PM IST

Updated : Jan 24, 2024, 8:03 PM IST

ACB Raids in HMDA Planning Director House : ఆదాయానికి మించిన అస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై హెచ్‌ఎండీఏ(HMDA) టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఎస్‌ బాలకృష్ణ ఇళ్లు, కార్యాలయల్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు చేసింది. ఇవాళ ఉదయం 5గంటల నుంచి బృందాలుగా విడిపోయి ఏసీబీ అధికారులు(ACB Officers) సోదాలు నిర్వహించారు.

బాసు లంచం అడిగావో జైలు ఖాయమంటున్న ఏసీబీ అధికారులు

ప్రస్తుతం ఆయన రియల్‌ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా మాసబ్ ట్యాంక్​లోని రెరా కార్యాలయం, హెచ్‌ఎండీఏ కార్యాలయం(HMDA Office), మణికొండలోని ఆదిత్య ఫోర్ట్ వివ్యూలో ఉన్న నివాసం, బంధువులు ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ, ఏకకాలంలో 20 చోట్ల 14 బృందాలతో దాడులు జరిపారు.

హెచ్ఎండీఏ డైరెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు

రూ.100 కోట్లకు పైగా ఆస్తులు : అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇష్టానుసారం అనుమతులు జారీ చేసి అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని, ఇటీవల ఏసీబీకి వచ్చిన సమాచారంతో అధికారులు సోదాలు చేశారు. కాగా ఇప్పటివరకూ రూ.100 కోట్లకుపైగా స్థిర, చర ఆస్తులు గుర్తించారు. వాటిలో రూ.40 లక్షల నగదు, రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఖరీదైన 60 చేతి గడియారాలు, ఆస్తిపత్రాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు ధ్రువీకరించారు. అలానే 14 ఫోన్లు, 10 ల్యాప్​టాప్​లు మొదలగు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సైతం ఉన్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనపరచుకున్నారు.

ACB raid in rangareddy district : రూ.30వేలకు కక్కుర్తి పడి.. అనిశాకు చిక్కిన విద్యుత్ అధికారి

బాలకృష్ణకు సంబంధించిన బ్యాంకు లాకర్లు(Bank lockers), ఇతర ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే గురువారం కూడా సోదాలు కొనసాగునున్నట్లు అధికారులు తెలిపారు. బ్యాంక్ లాకర్ల వివరాలు తెలిస్తే మరిన్ని ఆస్తులు ఈ తనిఖీల్లో బయటపడే అవకాశముందని స్పష్టమవుతోంది. ఏసీబీ దాడుల్లో ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడటం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అవినీతికి పాల్పడ్డ అధికారులపై దాడులు పెరిగాయి. దీనికి తోడు ఏసీబీ డైరెక్టర్​గా సీవీ ఆనంద్ నియామకం కావడం కూడా ఈ శాఖ పని జోరందుకుంది. తాజా దాడులు ఇతర అవినీతికి పాల్పడ్డ అధికారుల్లో గుబులు రేపుతున్నాయి. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి తీసుకున్న నిర్ణయాలు, అవినీతి వ్యవహారాలు ఇప్పుడు తమ తలకు చుట్టుకున్నట్లు ఆందోళన చెందుతున్నారు.

డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు దాచిన 'అవినీతి' అధికారి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బహదూర్​పురా ఎస్సై

Last Updated : Jan 24, 2024, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.