ETV Bharat / state

శివబాలకృష్ణ బినామీలను విచారిస్తున్న ఏసీబీ - ఆ ఇద్దరి పేరు మీద అనేక భూములు, స్థలాలు! - శివ బాలకృష్ణ బినామీలపై విచారణ

ACB Investigation On Balakrishna Case : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్​ శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ(ACB) లోతైన దర్యాప్తు చేస్తోంది. రెండో రోజు అతని బినామీలను ఏసీబీ విచారిస్తోంది. సత్యనారాయణ, భరత్‌ ఇద్దరు బాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అనేక భూములు, స్థలాలు వారిద్దరి పేరు మీద ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

HMDA Former Director Shiva Bala Krishna Case
ACB Investigation On Balakrishna Case
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 2:20 PM IST

ACB Investigation On Balakrishna Case : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ వ్యవహారంలో రెండో రోజు అతని బినామీలను ఏసీబీ విచారిస్తోంది. సత్యనారాయణ, భరత్‌ ఇద్దరు బాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అనేక భూములు, స్థలాలు వారిద్దరి పేరు మీద ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని వరుసగా రెండో రోజు కూడా విచారిస్తున్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి వారిని పలిపించి ప్రశ్నిస్తున్నారు. కస్టడీ విచారణ సమయంలో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు శివబాలకృష్ణ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో మరింత లోతుగా ఈ కేసును విచారించాలని అనిశా నిర్ణయించింది.

ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ - రూ.250 కోట్ల పైనే ఆస్తులున్నట్లు గుర్తింపు

Shiva Bala Krishna Case Update : భరత్‌కుమార్‌ పేరిట నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరులో 13 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించింది. వాటి కొనుగోలుకు ఆదాయ వనరుల గురించి ప్రశ్నించగా భరత్‌కుమార్‌ నుంచి సరైన సమాధానం లభించలేదని తెలిసింది. ఈ క్రమంలో శివబాలకృష్ణ అక్రమార్జనతోనే ఆ భూముల్ని కొనుగోలు చేసి భరత్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు అనిశా అనుమానిస్తోంది. బాచుపల్లి ప్రాంతంలో ఉండే సత్యనారాయణమూర్తి శివబాలకృష్ణ అక్రమార్జనను ఆస్తులుగా మలచడంలో కీలకపాత్ర పోషించాడనే అనుమానంతో విచారిస్తోంది.

మరోవైపు శివబాలకృష్ణ వద్ద పనిచేసిన డ్రైవర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, అటెండర్లనూ విచారించడంపై అనిశా దృష్టి సారించింది. స్థిరాస్తి వ్యాపార సంస్థలకు అడ్డదారిలో అనుమతులు ఇప్పించే విషయంలో వీరు మధ్యవర్తులుగా వ్యవహరించి ఉంటారని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో శివబాలకృష్ణ అడ్డదారి వ్యవహారాలు మరిన్ని బహిర్గతం అవుతాయని అంచనా వేస్తోంది. మరింత మందిని కూడా ఈ కేసులో విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ శాఖల అధికారులకు ఏసీబీ విచారణ బృందం బాలకృష్ణ ఆస్తులు, భూములు ఇంకా ఏమైనా ఉన్నాయా అని సమాచారం రాబడుతోంది. ఇందులో భాగంగా పలువురు అధికారులకు ఏసీబీ అధికారులు లేఖలు రాశారు.

HMDA Former Director Shiva Bala Krishna Case : శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తులో విస్తురపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూ.250 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను పోగుచేసినట్లు ఏసీబీ అధికారులు కనుక్కున్నారు. ఇందులో బినామీల పేరిటే 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు తేలింది.

శివబాలకృష్ణకు కోర్టులో చుక్కెదురు - బెయిల్​ పిటిషన్​ కొట్టివేత

శివబాలకృష్ణ కేసు లేటెస్ట్ అప్డేట్​ - ఆ ఐఏఎస్ అధికారిని విచారించే యోచనలో ఏసీబీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.