ACB Caught Tribal Welfare Executive Engineer : రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ వైపు అవినీతి అనకొండ శివబాలకృష్ణ నిర్వాకాలు సంచలనం రేపుతుంటే, మరోవైపు మరోవైపు ప్రభుత్వ అధికారుల చేతివాటాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌లో పూర్తి చేసిన పనుల బిల్లులు మంజూరు చేసేందుకు రూ.84వేలు లంచం తీసుకుంటున్న అధికారిణిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Nizamabad Tribal Welfare Executive Bribe Case : లంచం తీసుకుంటూ ట్రైబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. జగజ్యోతి ఏసీబీ అధికారులకు పట్టుబడింది. నిజామాబాద్‌లోని పూర్తి చేసిన పనులకు బిల్లులు మంజూరు చేసేందుకు, గాజుల రామారంలోని బాలల సంరక్షణ గృహనిర్మాణ పనులు అప్పగించేందుకు కాంట్రాక్టర్ బోడుకం గంగాధర్ వద్ద జగజ్యోతి డబ్బులు డిమాండ్ చేసింది.
దీంతో గంగాధర్ అనిశా అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం గంగాధర్ రూ. 84వేలు లంచం ఇస్తున్న సమయంలో అనిశా అధికారులు వలపన్ని జగజ్యోతిని పట్టుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు అనంతరం రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Nalgonda Hospital Superintendent Bribe Case : ఇటీవల నల్గొండ జిల్లాలో ఏసీబీ వలకు అవినీతి తిమింగలం చిక్కింది. రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఔషధాల టెండర్ కోసం ఓ వ్యాపారిని ఆయన రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని (ACB)ఆశ్రయించాడు. ఈరోజు తన ఇంట్లోనే లంచం తీసుకుంటుండగా అధికారులు అతణ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెండేళ్ల క్రితం బదిలిపై నల్గొండకు వచ్చిన లచ్చునాయక్‌పై గతంలోను పలు ఆరోపణలు ఉన్నాయి.
Shamirpet MRO Bribe Case : రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట తహశీల్దార్ తోడేటి సత్యనారాయణ అవినీతి శాఖ అధికారులకు చిక్కాడు. గచ్చిబౌలిలో ఉంటున్న రామశేషగిరిరావు చెందిన భూమి శామీర్‌పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు (Pass Book) జారీ చేసేందుకు, అనుకూలంగా కలెక్టర్‌కు నివేదిక పంపేందుకు ఎమ్మార్వో సత్యనారాయణ, రామశేషగిరిరావు నుంచి రూ.10లక్షలు లంచం డిమాండ్ చేశాడు.
శామీర్‌పేట మండలంలోని లాల్‌గాడి మలక్‌పేట గ్రామ పరిధిలో గుంటూరు జిల్లా వాసి మొవ్వ శేషగిరిరావు 2006లో 39 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అనంతరం 10 ఎకరాలు భాగస్వామికి అమ్మగా తనకు 29 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. తన భూమిని ధరణిలో(Dharani Portal) అప్‌లోడ్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి రూ.40 లక్షలు తహసీల్దార్ సత్యనారాయణ డిమాండ్ చేసినట్లు బాధితుడు శేషగిరిరావు తెలిపారు.
అవినీతి శాఖల జాబితాలో ఎక్సైజ్ కూడా చేరింది - ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆసక్తికర ట్వీట్
ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం - రూ.3 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ నల్గొండ ఆసుపత్రి సూపరింటెండెంట్