ACB Arrest sheep Distribution Scam : బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ(sheep Distribution) అక్రమాల కేసులో అరెస్టులు మొదలయ్యాయి. గొర్రెల స్కాంలో కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్టు చేసిన అధికారులు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లలైన రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్‌లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
అనంతరం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు రూ. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను నిందితులు మళ్లించుకున్నారు. విచారరించిన ఎసీబీ కోర్టు నలుగురు నిందితులకు జ్యూడిషల్ రిమాండ్ విధించింది. మార్చి 7 వరకు కోర్టు రిమాండ్ విధించడంతో నాంపల్లి నుంచి చంచల్‌గూడ జైలుకి అధికారులు తరలించారు.
గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ అధికారులు గత కొద్ది రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే కోణంలో ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల కాగ్ కూడా ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని తన నివేదికలో పేర్కొంది.
గొర్రెల నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ లోతైన దర్యాప్తు - 2 కోట్ల నిధులకు పైగా దారి మళ్లినట్లు గుర్తింపు
గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన గొర్రెల పంపిణీ పథకంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని బాధితులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలు కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, బాధితులు అప్పట్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్(Gachibowli Police Station)లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు ఏసీబీకి బదిలీ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా గొర్రెల పంపిణీ పథకం(Sheep Distribution Scheme) కోసం గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన 15 మంది రైతుల వివరాలను అధికారుల సేకరించారు.
130 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినందుకు గానూ తమకు రావాల్సిన నగదు రూ.2.10 కోట్లకు సంబంధించిన ఆధారాలన్నింటినీ అధికారులకు ఇచ్చామని బాధితులు ఏసీబీతో తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ (Animal Husbandry Department) అధికారులు, కాంట్రాక్టర్ మోహినుద్దీన్ మధ్యవర్తిగా ఉండి తమ వద్ద గొర్రెలను తీసుకున్నారని తెలియజేశారు. తమకు రావలసిన నగదు చెల్లించకుండా మోసం చేసిందే కాకుండా దుర్భాషలాడారని ఏసీబీ అధికారులకు బాధితులు వివరించారు.
ఏంటీ! అంబులెన్సులు, ఆటోలు, బైకుల్లో 'గొర్రెల పంపిణీ' చేశారా? - కాగ్ సంచలన రిపోర్ట్