ETV Bharat / state

నీళ్లలో దూకమని ఎంకరేజ్ చేసిన ఫ్రెండ్స్ - మద్యం మత్తులో దూకిన యువకుడు - కళ్లముందే మునిగిపోతున్నా? - HYD YOUNG MAN DROWNED - HYD YOUNG MAN DROWNED

Hyderabad Young Man Jumps Into Water After Friends Dare : హైదరాబాద్​లోని జహంగీరాబాద్‌ బస్తీకి చెందిన ఐదుగురు స్నేహితులు కర్నాటకలోని దర్గాకెళ్లి తిరిగొస్తుండగా మార్గ మద్యలో మద్యం మత్తులో ఉన్న యువకుడు ఈతకు బ్యారేజీలోకి దూకి మరణించాడు. కాపాడే అవకాశం ఉన్నా ఇద్దరు స్నేహితులు వెనుకంజవేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Young Man Died After jumping Into the Pond
A young man drowned in Barrage (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 12:18 PM IST

Young Man Died After jumping Into The Pond : ఈ రోజుల్లో స్నేహితులు ఏదైనా ప్రమాదాల్లో ఉంటే ప్రాణాలకు తెగించి కాపాడే సన్నివేశాలను చూశాం. కానీ నీటిలో మునిగిపోతున్న స్నేహితుడిని రక్షించే అవకాశం ఉన్నా తోటి మిత్రులు చూస్తూ ఉండిపోయారు. దర్గాకెళ్లి తిరిగొస్తుండగా మద్యం మత్తులో తూలుతున్న యువకుడు బ్యారేజీలోకి దూకి నీటమునిగి మరణించాడు. ఈ దుర్ఘటన ఈ నెల 19న కర్ణాటక రాష్ట్రం, కమలాపూర్‌ తాలూకా, పటవాడ గ్రామం సమీపంలో జరిగింది. మృతుడు పాతబస్తీ బండ్లగూడ ఠాణా పరిధిలోని జహంగీరాబాద్‌ వాసిగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : జహంగీరాబాద్‌ బస్తీకి చెందిన సయ్యద్‌ వాజీద్‌ అలియాస్‌ వాజీద్‌ గోటి(27), మహ్మద్‌ అఫ్రోజ్‌ అలియాస్‌ అఫ్ఫు కోమా(28), తాజుద్దీన్‌ అలియాస్‌ తాజు(26), సయ్యద్‌ సమీర్‌(25), మహ్మద్‌ సాజిద్‌(27)లు ఈనెల 18న రాత్రి ఆటోలో కర్ణాటక రాష్ట్రం కమలాపూర్, చెడుగుప్ప, చెంగటలోని మస్తానా ఖాద్రీ దర్గాలో ప్రార్థనలకు వెళ్లారు.

19న తిరుగు ప్రయాణంలో కమలాపూర్‌ తాలూకా, పటవాడ గ్రామం సమీపంలోని బ్రిడ్జికో, మిడ్‌వే సెయిల్‌ బ్యారేజీ వద్దకు వచ్చారు. అంతకు ముందే వీరంతా గంజాయి, మద్యం తాగి మత్తులో ఉన్నారు. బ్యారేజీలో దిగిన తాజుద్దీన్, అఫ్రోజ్‌లు ఈత కొడుతున్నారు. గట్టునే ఉన్న మహ్మద్‌ సాజిద్‌ మత్తులో కాలు నిలపలేని స్థితిలో ఈత కొడతాను అన్నాడు. తోటి స్నేహితుడు ఈత వస్తేనే నీటిలోకి దిగు లేకపోతే వద్దు అని వారించాడు. అయినా వినకుండా సాజిద్‌ నీటిలోకి దూకేందుకు సిద్ధమయ్యాడు.

Young Persons Dead in Pond Near Kowkur Dargah : చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి.. మృతదేహం కోసం గాలింపు చర్యలు

ఈదలేక నీట మునిగి మృతి : తోటి స్నేహితుడు 1, 2, 3 అంటూ ఇక్కడి నుంచి దూకాలని ప్రేరేపించాడు. సాజిద్‌ దుస్తులతోనే నీటిలోకి దూకేశాడు. ఈత వచ్చినా మత్తులో ఉండటంతో ఈదలేక పోయాడు. గట్టున ఉన్న స్నేహితుడు ఒకరు తాజుద్దీన్‌ను వారించాడు. అఫ్రోజ్‌ సైతం దగ్గరికి రమ్మంటూ పిలిచాడు. చేతగాని స్థితిలో సాజిద్‌ నీటిలో మునిగిపోయాడు. పట్టుకునే అవకాశం ఉన్నా ఇద్దరు స్నేహితులు వెనుకంజవేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

గట్టున ఉన్న మరో స్నేహితుడు సాజిద్‌ను కాపాడండి మునిగిపోతున్నాడు అంటూ బ్యారేజీ పక్కనే ఉన్న స్థానికులను బతిమాలాడు. అంతలోనే యువకుడు నీటిలో మునిగిపోయాడు. కమలాపూర్‌ ఠాణా పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని బయటికి తీశారు. సాజిద్‌కు ఈత వచ్చని అయినా నీటిలో మునిగి చనిపోయాడని, దీనిపై అనుమానాలు ఉన్నాయంటూ మృతుని సోదరుడు మహ్మద్‌ రషీద్‌ కమలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చెరువుల్లో స్విమ్మింగ్​కు వెళ్తున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే మీ ప్రాణాలకే డేంజర్! - Safety Tips For Swimming in Telugu

ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా - తల్లిదండ్రులకు తీరని కడుపుకోత - Three Died in Nizamabad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.