ETV Bharat / state

ప్రేమికుడి ప్రాణం తీసిన రైల్వే గేటు - ఆత్మహత్య చేసుకున్న ప్రేయసి

సకాలంలో వైద్యం అందక యువకుడు మృతి - ఓ యువతిని మోసం చేశామని పంచాయతీ పెడతామని హెచ్చరించడంతో ఉరి వేసుకున్న యువకుడు -ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో రైల్వేగేట్‌ అడ్డు పడటంతో మృతి

The young Man Died Due to Lack of Timely Treatment
The young Man Died Due to Lack of Timely Treatment (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

The young Man Died Due to Lack of Timely Treatment : ప్రేమించిన అమ్మాయి విషయంలో కొందరు యువకులు బెదిరించడంతో మనస్థాపానికి గురైన ప్రేమికుడు ఆత్మహత్యయత్నం చేశాడు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా రైల్వే గేటు పడింది. సకాలంలో ఆసుపత్రికి చేర్చకపోవడంతో మార్గమధ్యలోనే ఆ యువకుడు ప్రాణాలొదిలిన ఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం వీరాపూర్‌ గ్రామానికి చందిన యాదగిరి, ఓ అమ్మాయి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషమంతా ఊరంతా తెలిసింది. అయితే పొలం పనులు చేసుకుంటున్న ఆ యువకుడి దగ్గరకు కొంతమంది వెళ్లి 'నువ్వు యువతిని నమ్మించి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నావ్. పెళ్లి చోసుకోవాలి లేకపోతే ఈ విషయంపై రెండు రోజుల్లో పంచాయతీ పెడతాం. జాగ్రత్త' అని బెదిరించారు.

Young Woman Suicide After Her Lover Death : 'నువ్వు లేని లోకంలో నేను జీవించలేను'.. మరణించిన ప్రియుడి చెంతకు ప్రియురాలు

బెదిరించడంతో యువకుడు మనస్థాపానికి గురై : ప్రేమించిన అమ్మాయి విషయంలో అలా వచ్చి చెప్పేసరికి ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. మనస్థాపానికి గురైన యువకుడు ఇంటి సమీపంలో చెట్టుకు ఉరి వేసుకోగా దాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించారు. చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ ఆసుపత్రికి కారులో తరలిస్తుండగా జిల్లా కేంద్రం తిమ్మసానిపల్లి వద్ద రైల్వే గేటు పడింది. వెనక్కి తీసుకెళ్లలేరు, ముందుకు కదల్లేని పరిస్థితి. అయినా చేతుల మీద రైల్వే గేటు దాటేందుకు ప్రయత్నించినా రైలు రావడంతో సాధ్యపడలేదు. కారులోనే నోటి ద్వారా గాలి అందించినా, సీపీఆర్‌ చేసిన ఫలించలేదు. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ఆటోలో అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సదరు అమ్మాయి కూడా ఆత్మహత్యాయత్నం : ఈ విషయం తెలుసుకున్న సదరు అమ్మాయి భయపడో లేక ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడో అనుకుందో కానీ తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. వెంటనే ఆమెను మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

ఎనిమిదేళ్ల ప్రేమ - ప్రేయసి మోసం చేసిందని ప్రేమికుడు ఆత్మహత్య - Young Man Suicide failed love in ap

ప్రియురాలిపై అనుమానం - గొంతు కోసి, కళ్లలో పొడిచి ప్రేమికుడి హత్యాయత్నం - lover attack on girlfriend

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.