ETV Bharat / state

కారును ఢీకొట్టిన పెద్దపులి - ఆ తరువాత ఏమైందో తెలుసా! - Tiger Attacked A Car in Nellore - TIGER ATTACKED A CAR IN NELLORE

Tiger Hit A Car in Nellore : ఏపీలోని నెల్లూరు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటే క్రమంలో ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. అనంతరం కారుపై దాడి చేసే ప్రయత్నం చేసింది. ఊహించని ఈ పరిణామంతో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కారు ఈడ్చుకెళ్లడంతో పెద్దపులి కాళ్లకు తీవ్రగాయాలయినట్లు డ్రైవర్ తెలిపారు.

A tiger hit a car
A tiger attacked a car in Nellore (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 3:49 PM IST

Tiger Attacked a Car in Nellore : ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారు, పెద్దపులిని ఢీకొట్టింది. ఈ ఘటనతో కారు డ్రైవర్ భయాందోళనకు గురయ్యారు. పులిని తప్పించే క్రమంలో కారు బోల్తా పడింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.

రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె సమీపంలో నెల్లూరు-ముంబయి హైవేపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో నెల్లూరు వెళ్తున్నారు.

నెల్లూరు జిల్లాలో ఊహించని ఘటన : కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటే క్రమంలో ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. వేగంగా వస్తుండటంతో పులిని కారు కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అనంతరం డ్రైవర్‌ శ్రీనివాసులు అప్రమత్తమై బ్రేక్‌ వేశాడు. కారు ఈడ్చుకెళ్లడంతో పెద్దపులి కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. ఊహించని ఈ ఘటనతో కారులోని ఐదుగురూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదంతో కారు ముందుభాగం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లి కూంబింగ్‌ చేయనున్నట్లు తెలిపారు. పెద్దపులి సంచారంతో మర్రిపాడు మండలంలోని అటవీప్రాంత గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

ఇంతవరకూ తమకు పెద్దపులి సంచారం కనిపించలేదని, ఇదే మెుదటి సారిగా పులి ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నారు. ఆ పులి ఇతర ప్రాంతాల నుంచి ఇటువైపు వచ్చి ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. అయితే, పులి సంచారం వార్తల నేపథ్యంలో కదిరినాయుడుపల్లెలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు తెలిపారు.

'బద్వేల్ నుంచి నెల్లూరు వెళ్తుండగా కదిరినాయుడుపల్లి అటవీ సమీపంలో పెద్దపులి కారుపై దాడి చేసింది. పులి దాడి విషయం తెలుసుకున్న వెంటనే ఘటన ప్రదేశానికి చేరుకున్నాం. పాద ముద్రలను చూస్తుంటే పులికి సంబంధించినట్లు కనిపిస్తున్నాయి. పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకూ ఎవ్వరికి ఎలాంటి హాని జరగలేదు. కేవలం కారుపై మాత్రమే దాడి చేసినట్లు తెలుస్తుంది. డ్రైవర్ చెప్పిన విషయాలను గమనిస్తుంటే, పులికి సైతం గాయాలు అయినట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన పులి ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నాం. గాయాల పాలైన పులికి చికిత్స అందించే ప్రయత్నం చేస్తాం.' అటవీ శాఖ అధికారులు

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్​కు వెళ్తున్నారా? - జులై 1 నుంచి వాటిని తీసుకెళ్తే నో ఎంట్రీ - PLASTIC BANS IN AMRABAD RESERVE

హైదరాబాద్​లో అడవి పిల్లి సంచారం - భయాందోళనలో ప్రజలు - Wild Cat Roaming In Hyderabad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.