ETV Bharat / state

పేద దంపతుల పెద్ద మనసు - అన్నార్థులకు అండగా రూ.10 లక్షలు విరాళం - Old Age Couple Huge help - OLD AGE COUPLE HUGE HELP

Old Age People Huge Help : 'సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి సాయపడవోయి' అన్నారు మహాకవి గురజాడ. కానీ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వృద్ధ దంపతుల పెద్ద మనసు చూస్తే, కొంత కాదు ఉన్నదంతా పరోపకారానికే ఉపయోగించారు అనక తప్పదు. జీవిత చరమాంకంలో ఉన్న ఆ పేద దంపతులు, ఇన్నాళ్లూ దాచుకున్న సొమ్ము ఏకంగా రూ.10 లక్షలను అభాగ్యుల కోసం విరాళంగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.

Old Age People Huge help
Old Age Couple Help (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 10:06 PM IST

Updated : Aug 24, 2024, 10:57 PM IST

Poor Couple Huge Help to orphans : ఆ దంపతులు పుట్టుకతో దివ్యాంగులు, రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. వారికి ముగ్గురు పిల్లలు. కష్టపడి వారిని చదివించి ముగ్గురుకీ పెళ్లిళ్లు చేశారు. ఇప్పుడు పెద్ద బాధ్యతలేవీ లేకపోవడంతో, జీవిత చరమాంకంలో ఉన్న ఆ పేద దంపతులు ఇన్నాళ్లూ దాచుకున్న సొమ్ము రూ. 10 లక్షలను అభాగ్యుల కోసం వెచ్చించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన ముడుంబ విజయభాస్కరాచార్యులు (63) ఇంటర్‌ వరకు చదువుకున్నారు. 1986లో ఆయనకు వకుళాదేవి (60)తో పెళ్లైంది. ఆయన పౌరోహిత్యం, సైకిల్‌ రిపేర్​ వంటి వృత్తులతో పాటు, ప్రభుత్వం నుంచి వచ్చే దివ్యాంగ పింఛనుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. తమ ముగ్గురు కుమార్తెలు హరిచందన, శ్రీలక్ష్మి భార్గవి, సింధూరిలను సర్కార్​ బడులు, హాస్టళ్లలోనే డిగ్రీ వరకు చదివించి వివాహాలు చేశారు.

రూ.10 లక్షలు అన్నం ఫౌండేషన్‌ పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ : సొంత ఇల్లు కూడా లేని ఆ దంపతులు గత రెండేళ్లుగా సత్తుపల్లిలో చిన్న కుమార్తె సింధూరి వద్ద ఉండి జీవనం సాగిస్తున్నారు. వయసు మీద పడుతుండడంతో తాము దశాబ్దాలుగా రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న కష్టార్జితాన్ని అనాథలు, అభాగ్యుల ఆశ్రమానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఖమ్మం జిల్లాలోని అన్నం ఫౌండేషన్‌ను సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న అనాథలు, మానసిక దివ్యాంగులకు తమ వంతు సాయం చేయాలని నిశ్చయించుకున్నారు.

కుమార్తెలు, అల్లుళ్లు, కుటుంబసభ్యుల అంగీకారం, ప్రోత్సాహంతో తాము గత కొన్నేళ్ల నుంచి కూడబెట్టుకున్న రూ.10 లక్షలను అన్నం ఫౌండేషన్‌ పేరిట శుక్రవారం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావుకు అందజేశారు. ఆ దంపతులను ఫౌండేషన్‌ బాధ్యులు డా. అన్నం శ్రీనివాసరావు ఘనంగా సత్కరించి అభినందించారు. జీవిత చరమాంకంలో ఉన్నప్పటికీ, కనీసం సొంత ఇళ్లు కూడా లేని స్థితిలో బతుకు వెళ్లదీస్తున్న దంపతులు. అన్నార్థులు, అభాగ్యులకు బతుకు నిచ్చేందుకు అనాథాశ్రమానికి భారీ విరాళం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నం శ్రీనివాసరావు అన్నారు.

తెలుగు తేజం కృష్ణ చివుకుల ఉదారత - ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల భారీ విరాళం - 228 crores donation to iit madras

ఆ కుటుంబానికి ఎంత కష్టమొచ్చింది - ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురుచూపు - A Poor Family Waiting For Helping Hands

Last Updated : Aug 24, 2024, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.