Child Died in Attack by Stray Dogs : ఈ మధ్య కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. సైలెంట్‌గా ఉంటూనే జనాలపైకి వచ్చి భయబ్రాంతులను గురి చేస్తున్నాయి. ఈ కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. అలాగే కుక్క కాట్లకు లక్షల మంది గురవుతున్నారు. పెద్దలు అయితే ఎలాగోలా తప్పించుకొని గాయాలతో బయటపడుతున్నా, చిన్నారులు మాత్రం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. తాజాగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో వివాహం జరిగిన 12 ఏళ్లు తర్వాత పుట్టిన కుమారుడిని కుక్కలు చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఏడాది బాలుడిని వీధి కుక్కలు పొట్టన పెట్టుకున్నాయి. అక్కడి స్థానిక తుపాన్ కాలనీలో బాలతోటి గోపాలరావు, నాగమణి జీవనం సాగిస్తున్నారు. వీరికి 12 ఏళ్లుగా సంతానం లేరు. అయితే లేకలేక పుత్రుడు జన్మించాడు. ఆ చిన్నారికి ఏడాది వయసు ఉంటుంది. సోమవారం తల్లి బాలుడిని తీసుకొని స్నానం చేయించడానికి ఇంటి లోపలి నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇంతలోనే ఏదో మర్చిపోయానని చిన్నారిని అక్కడే ఉంచి ఇంట్లోకి వెళ్లింది.
అంతలోనే హఠాత్తుగా అక్కడకు కుక్కల గుంపు వచ్చింది. బాలుడిపై దాడి చేసి నోట కర్చుకుని అక్కడి నుంచి లాక్కుని పోయాయి. ఇంతలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తల్లి, బిడ్డ కనిపించకపోవడంతో వెదకడానికి రోడ్డుపై పరుగులు తీశారు. దూరంగా కుక్కల గుంపు కనిపించడంతో స్థానికుడు ఒకరు కర్రతో వాటిని తరిమివేయగా, అక్కడ తీవ్ర గాయాలతో బాలుడు పడి ఉన్నాడు. రక్తస్రావంతో ఉన్న బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే చిన్నారి కన్నుమూశాడు. పెళ్లయిన పన్నెండేళ్లకు పుట్టిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు.
కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు : తెలంగాణలో కుక్కల దాడుల నుంచి రక్షణ పొందేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం కుక్కల నియంత్రణ ఆపరేషన్ చేస్తోంది. కుక్కల దాడిలో మనుషులు తీవ్రంగా గాయపడుతున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం కుక్కల నియంత్రణకు కుటుంబ నియంత్రణే సరైన పద్ధతి అని భావించి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
బాబోయ్ కుక్కలు - ఆడుకుంటున్న బాలుడిపై అటాక్ - వీడియో వైరల్
ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి - సీసీటీవీ విజువల్స్ వైరల్ - DOG ATTACKS IN NIZAMABAD TOWN