A Man Dies Egg Stuck In Throat : రోజూ ఎక్కడో ఒక చోట విచిత్రమైన మరణ వార్తలు వింటుంటాం. మనం తినే ఆహారం కూడా ఒక్కోసారి మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఇలాంటి ఘటనలు చాలా చూస్తున్నాం. మాంసం ముక్క గొంతులో ఇరక్కొని మరణించాడని, దోస తింటుండగా గొంతులో ఇరుక్కొని, కొబ్బరి ముక్క ఇరుక్కొని ప్రాణాలు పోయిన వార్తలూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంటాయి. అయితే చావు, పుట్టుకలు మన చేతుల్లో ఉండవు. మృత్యువు సమీపించే వేళైతే ఎవరూ ఆపలేరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, భద్రంగా ఉన్నామని భావించినా, నాకేం అవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉన్నా, చావు దగ్గరైతే తప్పించుకోలేరంటారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఇలాంటి ఓ ఘటనే జరిగింది. ఉడకబెట్టిన కోడి గుడ్డు గొంతులో ఇరుక్కుని ఒక వ్యక్తి మృతి చెందాడు.
ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం : బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామానికి చెందిన తిరుపతయ్య (60) లింగాలలో ఉన్న బంధువు ఇంటికి వచ్చారు. అప్పాయిపల్లిలో ఉన్న మరో బంధువు ఇంటికి వెళ్లడానికి లింగాల రామాలయం కమాన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఓ బజ్జీల బండి వద్ద ఆగాడు. బండి వద్ద ఉడకబెట్టిన కోడి గుడ్డు తింటుండగా అది గొంతులో ఇరుక్కుంది. దీంతో తిరుపతయ్యకు ఊపిరాడలేదు. గమనించిన స్థానికులు నీళ్లు తాగిస్తుండగా, ఆయన మరణించారు. పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మద్యం మత్తులో దోశ తింటున్నారా? అయితే మీ కోసమే ఈ న్యూస్
ఎంత పనైంది : సండే కదా అని చికెన్ తెస్తే - చిన్నారి ప్రాణం పోయింది