A Man Died Dosa Stuck In Throat : చావు, పుట్టుకలు మన చేతుల్లో ఉండవు. మృత్యువు సమీపించే వేళైతే ఎవరూ ఆపలేరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, భద్రంగా ఉన్నామని భావించినా, నాకేం అవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉన్నా చావు దగ్గరైతే తప్పించుకోలేరంటారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇలాంటి ఓ ఘటనే జరిగింది.
నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్లో వెంకటయ్య అనే వ్యక్తి(43) ఇంట్లో ఉదయం అల్పాహారంగా దోశలు తింటున్నాడు. దోశను ఒక్కసారే మింగే ప్రయత్నం చేయగా అది ఇరుక్కుపోయింది. దీంతో వెంకటయ్యకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్లు అయింది. గాలి పీల్చుకోవడం కష్టంకావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి ఎంత ప్రయత్నించినా వెంకటయ్యకు ఊపిరి అందలేదు. హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వెంకటయ్య మరణించినట్లు ప్రకటించారు. వెంకటయ్య అప్పటికే మద్యం తాగాడని ఆ మత్తులోనే టిఫిన్ తింటుండగా ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.