ETV Bharat / state

ప్రియురాలిపై అనుమానం - గొంతు కోసి, కళ్లలో పొడిచి ప్రేమికుడి హత్యాయత్నం - lover attack on girlfriend - LOVER ATTACK ON GIRLFRIEND

Lover Attack In old city Chatrinaka : ప్రియురాలిపై అనుమానంతో ఆమెపై హత్యాయత్నం చేశాడు ఓ ప్రేమికుడు. ఈ ఘటన పాతబస్తీ ఛత్రినాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Lover Attack In old city Chatrinaka
Lover Attacked on His Girlfriend In old city Chatrinaka (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 1:39 PM IST

Updated : Jun 18, 2024, 2:28 PM IST

Lover Attacked on His Girlfriend In old city Chatrinaka : ఇది వరకే వివాహం జరిగి, విడాకులైన మహిళతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న ప్రియుడే అనుమానంతో ప్రియురాలిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాతబస్తీ ఛత్రినాకకు చెందిన శ్రావ్య (32)కు ఇది వరకే ఓ వ్యక్తితో 2019లో వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో విడాకులు సైతం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆమె తల్లి వద్దనే ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

గౌలిపురకు చెందిన మణికంఠ, శ్రావ్యలు చిన్ననాటి నుంచి స్నేహితులు. భర్తతో విడాకుల అనంతరం శ్రావ్యతో మణికంఠ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా గత కొన్ని రోజులుగా శ్రావ్య మణికంఠతో దూరంగా ఉంటుంది. దాన్ని తట్టుకోలేకపోయిన మణికంఠ ప్రియురాలు మరొకరితోనూ ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అనుమానం పెంచుకున్నాడు. ప్రియురాలు దూరం పెట్టడం, ఆమెపై పెరిగిన అనుమానంతో కక్ష పెంచుకున్నాడు.

ప్రేమికుడితో కలిసి భర్తను చంపేసి - గుండెపోటని అందరినీ నమ్మించింది - చివరకు నిందితుడి పశ్చాత్తాపంతో! - Wife Killed Husband In Madhuranagar

మంగళవారం ఉదయం శ్రావ్య ఇంటికి వెళ్లాడు. ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి మణికంఠ ఆమెతో గొడవకు దిగాడు. వారి మధ్య మాటామాటా పెరగడంతో ఇంట్లోని కత్తి పీటతో ప్రియురాలి గొంతు కోయడంతో పాటు ముఖంపై దాడి చేశాడు. శ్రావ్య వాళ్ల ఇంటి నుంచి అరుపులు రావడంతో స్థానికులు వెళ్లి చూశారు. రక్తపు మడుగులలో ఉన్న శ్రావ్యను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రియురాలిపై అనుమానం గొంతు కోసి కళ్లలో పొడిచి దాడి ప్రేమికుడి హత్యాయత్నం (ETV Bharat)

"ఆమెకు ఇంతకు ముందే పెళ్లి అయిపోయింది. భర్తతో విడాకులు కూడా అయ్యాయి. మళ్లీ ఇతన్ని ప్రేమించింది. సడెన్‌గా ఆయన ప్రేమను ఆమె నిరాకరించింది. అతను వచ్చి డోర్‌ పెట్టేసి కత్తి పీటతోని ఆమెపైన కూర్చోని గొంతు కోసి, కళ్లపై పొడవటం జరిగింది. మాకు చప్పుడు వస్తే పైకి వెళ్లాం. కిటికీలు పగులకొట్టి చూస్తే ఇలా అయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం." - దీపక్‌, ఇంటి యజమాని

ప్రియుడితో కలిసి తల్లి హత్య.. ప్రేమ వద్దు అన్నందుకు మైనర్ కూతురు దారుణం

పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి మర్డర్​.. హత్యకు ముందే సెక్స్.. సూసైడ్​కు యత్నించి..

Last Updated : Jun 18, 2024, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.