Murder Case in Nalgonda: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డ తండాలో ఓ యువతి(19) అనుమానాస్పద మృతి కేసును వాడపల్లి పోలీసులు ఛేదించారు. ఈనెల 14న అనుమానాస్పద మృతి కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూపావత్ నాగు అనే వ్యక్తి ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి మొహం చాటేశాడు. ఆ బాధిత యువతి, నాగులు ఇద్దరు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది రోజులుగా యువతి పెళ్లి విషయం మాట్లాడేసరికి నాగు తప్పించుకుంటుండేవాడు.
యువతి హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండేది. ప్రియురాలు ఈ మధ్య ఎన్ని సార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు. పైగా యువతి ఫోన్ నంబరును బ్లాక్ చేసేశాడు. ఇది గమనించిన ఆ అమ్మాయి నేరుగా నాగు ఇంటికి పుట్టలగడ్డకు రాత్రి 7 నుంచి 8 గంటల సమయంలో వెళ్లింది. నాగు ప్రేమించిన విషయం, పెళ్లి సంబంధిత అంశాలను నాగు తల్లి బుజ్జికి చెప్పింది. వెంటనే బుజ్జి ఆ యువతిని మందలించి పంపించేసింది.
ఇలా ఇంటికి వచ్చి వేధిస్తున్న యువతిని వదిలించుకోవడానికి నాగు అతని బావ క్రాంతి కుమార్తో కలిసి యువతి హత్యకు ప్లాన్ వేశాడు. ఊరు నుంచి వెళ్తున్న ఆ అమ్మాయిని నమ్మించి బావ క్రాంతి, తల్లి బుజ్జి సహాయంతో పుట్టలగడ్డ తండా వద్ద నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. బలవంతంగా యువతిపై నాగు, క్రాంతి కుమార్ అత్యాచారం చేశారు. అత్యాచారం చేస్తున్న సమయంలో ప్రియుడు నాగు, తల్లి బుజ్జి కాపలా ఉంది. అత్యాచారం అనంతరం యువతి తన చున్నీని మెడకు గట్టిగా బిగించి చంపేశారు.
అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్టు అక్కడే ఉన్న చెట్టుకు వేలాడదీసి ఏమీ తెలియనట్లు వెళ్లిపోయారు. సాధారణ ఆత్మహత్యలా సీన్ క్రియేట్ చేశారు. తెల్లారేసరికి యువతి మృతి చుట్టు పక్కల ప్రాంతాల్లో సంచలనంగా మారడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు(సెప్టెంబరు 25) యువతి హత్య కేసులో ప్రియుడు రూపావత్ నాగు, అతని బావ రమావత్ క్రాంతి కుమార్, తల్లి బుజ్జిలను అరెస్ట్ చేసి వాడపల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇదివరకే రెండు సార్లు యువతికి అబార్షన్ చేయించినట్లు తేలిందని డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.
CHEATING: ప్రేమ పేరుతో మోసం.. ప్రియుడి ఇంటి ముందు యువతి దీక్ష
Love Fraud: ప్రేమ పేరుతో మోసం.. సోషల్ మీడియాలో నగ్న చిత్రాలు పోస్ట్.!