ETV Bharat / state

మత్తు బిస్కెట్లు ఇచ్చి - నైస్‌గా నగలు, నగదు కొట్టేసిన దుండగులు - Gang Stole a Farmer Gold In a Train

A Gang Stole a Farmer Gold In a Train : ప్రయాణికుడికి మత్తుమందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి బంగారం దోచుకున్న ఘటన హైదరాబాద్‌లోని కాచిగూడలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

A Gang Stole a Farmer Gold In a Train in Kachiguda
A Gang Stole a Farmer Gold In a Train in Kachiguda (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 1:54 PM IST

A Gang Stole a Farmer Gold In a Train in Kachiguda : దొంగతనం చేయడానికి ఒక ముఠా పక్కా ప్లాన్‌ చేసింది. అనురునట్టుగానే ట్రైన్ ఎక్కారు. ఒక వ్యక్తి కనిపించాడు. మెళ్లిగా అతనికి సీటు ఇచ్చి మాటలు కలిపారు. బిస్కెట్లో మత్తుమందు ఇచ్చారు. వారి ఒంటిపై ఉన్న నగలన్నీ దోచుకున్నారు. ఏదో సినిమా స్టోరీ చెబుతున్నట్లు ఉంది కదూ, ఇంచుమించు అంతే అయినా కానీ ఇది అక్షరాల జరిగిన ఘటన. ఇంతకి ఎక్కడ జరిగింతో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కాచిగూడ మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు మత్తుమందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి బంగారం కాజేశారు. కాచిగూడ రైల్వే పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌ జిల్లా సురపుర ప్రాంతానికి చెందిన రైతు సిద్దయ్య (49) బెంగళూరు వెళ్లడానికి ఈ నెల 18న కాచిగూడ స్టేషన్‌లో మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలో ఎక్కడు.

దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుందన్న దొంగ - కడుపు నిండా తినిపించి మరీ! - Nalgonda Theft Viral Video

సీటు ఇచ్చి కాజేశారు : ఈ ప్రయాణంలో అతనికి అపరిచిత వ్యక్తి పరిచయమయ్యాడు. మాట్లాడుకుంటూ వెళ్తున్న అతనికి పరిచయమైన వ్యక్తి సీటు ఇచ్చాడు. తర్వాత సదరు వ్యక్తితో పాటు మరో ఐదుగురు సిద్దయ్య మెళ్లిగా మాటలు కలిపారు. అది ఇది మాట్లాడుకుంటూ ప్రయాణించారు. ఆ తర్వాత సందేహం లేకుండా మత్తుమందు కలిపిన బిస్కెట్లు ఇచ్చారు. వాటిని తిన్న సిద్దయ్య వెంటనే నిద్రలోకి జారుకున్నాడు.

బంగారమంతా దోచుకున్నారు : బెంగళూరుకు చేరుకున్నాక సిద్దయ్య తన వస్తువులు పరిశీలించగా తన మెడలోని 5తులాల రెండు బంగారు గొలుసులు, చేతికున్న రెండు తులాల ఉంగరాలతో పాటు అతని జేబులోని రూ.50 నగదు కనిపించలేదు. దీంతో ఆదివారం రాత్రి బాధితుడు వచ్చి ఇక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోచారం ఐటీకారిడార్​లో భారీ చోరీ - రూ.2 కోట్లు సహా 28 తులాల బంగారం స్వాహా - Massive Theft in Medchal District

కన్నేస్తాడు - గెటప్​ మార్చేస్తాడు - ఆపై కొట్టేస్తాడు - తర్వాత ఎంచక్కా! - Gold theft in hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.