Lok Sabha Elections 2024 : నల్గొండ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులకు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు గైర్హాజయ్యారు. ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులకు కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు. సదరు ఉద్యోగులపై ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని వారిలో పీవో, ఏపీవో, ఇతర పోలింగ్ సిబ్బంది ఉన్నారు. వీరంతా సాగర్, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు.
నల్గొండ జిల్లాలో పోలింగ్ విధులకు ఉద్యోగుల గైర్హాజరు - ప్రజా ప్రాతినిథ్య చట్టం కింద కేసులు నమోదు - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024
Parliament Elections in Telangana : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రేపు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సామగ్రి, సంబంధిత సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలో ఎలక్షన్స్ డ్యూటీకి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు డుమ్మా కొట్టగా, వారిపై ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 కింద కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
![నల్గొండ జిల్లాలో పోలింగ్ విధులకు ఉద్యోగుల గైర్హాజరు - ప్రజా ప్రాతినిథ్య చట్టం కింద కేసులు నమోదు - lok sabha elections 2024 Lok Sabha Elections 2024](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-05-2024/1200-675-21449884-thumbnail-16x9-polling1.jpg?imwidth=3840)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : May 12, 2024, 3:27 PM IST