ETV Bharat / state

ముప్పై ఏళ్లుగా అన్నార్థుల ఆకలి తీరుస్తున్న నలుగురు అక్కాచెల్లెల్లు - భర్తలకు కూడా తెలియకుండా - Women Helps To Poor People - WOMEN HELPS TO POOR PEOPLE

9 Women Helps To Poor People : మంచి మనసు ఉంటే చాలు ఆర్థిక పరిస్థితులు, ఇతరత్రా కారణాలు ఏవీ సమాజసేవకు అడ్డుకాదని నిరూపించారు ఓ నలుగురు యువతులు. రోజూ వార్తల్లో కనీస అవసరాలు లేక ఇబ్బంది పడేవారి గురించి విని వారికి తమ వంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. సేవాకార్యక్రమాలకు డబ్బు కోసం చిన్నచిన్నపనులు చేస్తూ ఆ వచ్చిన సొమ్మును పేదలకోసం ఖర్చు చేస్తున్నారు. గత ముప్పై ఏళ్ల నుంచి సమాజహిత కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు. ఈ విషయం వారి భర్తలకు కూడా తెలియదు. ఇంతకీ వారి కథ ఏంటో తెలుసుకుందాం?

9 Women Helps To Poor People
9 Women Helps To Poor People (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2024, 4:18 PM IST

9 Women Helps To Poor People : యూఎస్‌లోని టెనసీ ప్రాంతంలో 4 అక్కాచెల్లెళ్లు ఉండేవారు. వాళ్లకు తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ, తాతయ్యల వద్దనే పెరిగారు. వాళ్లిద్దరూ దానగుణమున్నవారే. దాంతో తెలియకుండానే వీళ్లకి కూడా ఆ భావాలు అలవడ్డాయి. ఆ నలుగురు అక్కాచెల్లెళ్లు నలుగురూ పెరిగి, పెద్దయి జీవితంలో స్థిరపడ్డారు. అయితే, రోజూ వార్తల్లో కనీస అవసరాలు లేక ఇబ్బందిపడే వారి గురించి విన్నప్పుడల్లా వీరికీ తమవంతుగా ఏదైనా సాయం చేయాలనిపించిందట.

ఎంతోమంది అన్నార్తులకు ఆకలి తీర్చారు : దాంతో ఈ 4 అక్కాచెల్లెళ్లు మరో ఐదుగురు స్నేహితులతో కలిసి ‘9 నానాస్‌’ అనే ఒక రహస్య గ్రూపుగా ఏర్పడ్డారు. లాండ్రీ లాంటి పనులు సొంతంగా చేసుకుని ప్రతినెలా కొంత ధనాన్ని పొదుపు చేసుకునేవారు. ఆ సొమ్ముతో ఎవరికివారే ఇంట్లోనే కేకులు తయారుచేసేవారు. అందరూ ఉదయాన్నే 4గంటలకే నిద్రలేచి ఓ చోట సమావేశమయ్యేవారు. వాళ్లు తయారుచేసిన కేకులు, పెరుగును ప్యాక్‌ చేసి పేదవారికి, ఒంటరి తల్లులు, వృద్ధులు ఇలా అవసరమున్న వారికి పంచి తెల్లారేలోగా ఇంటికి చేరుకునేవారు. ఒక్క కేక్‌ మాత్రమే కాదు, సరకులు, దుస్తులు లాంటివి కూడా అందించేవారు. వాళ్లిచ్చే ఆ ప్యాకెట్‌ మీద 'సమ్‌బడీ లవ్స్‌ యు' అని నోట్‌ కూడా రాసి ఉంచేవారు. ‘మనల్ని ప్రేమించేవారూ ఈ సమాజంలో ఉన్నారని వాళ్లు ఫీల్‌ అవ్వడాన్నీ, వారి ముఖం మీద నవ్వుల్ని చూడాలన్నదే వీరి తాపత్రయం.

గత ముప్పై ఎళ్లుగా భర్తలకు కూడా తెలియకుండా : ఈ సేవాకార్యక్రమాలను ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసేవారు. చివరికి వాళ్ల భర్తలకు కూడా. అలా వీళ్లు నెల, రెండు నెలలు కాదు ఏకంగా 30ఏళ్లకు పైగానే ఈ రహస్య సేవా కార్యక్రమాలను కొనసాగించారు. అయితే, తొమ్మిది మందిలో ఒకరైన మేరీ ఎలెన్‌ అనే మహిళ భర్త ఒకరోజు దీన్ని గమనించారు. దాంతో ఆ సీక్రెట్‌ ఆపరేషన్‌ గురించి చెప్పక తప్పలేదు. ఈ విషయం తెలుసుకున్న వారి భర్తలు ఆశ్చర్యపోయారు.

తమ భార్యలు సాయంచేసే మనసుల్ని అర్థం చేసుకుని వాళ్లూ తోడ్పాటు అందించడానికి ముందుకొచ్చారు. చిన్న సాయానికే ప్రచారం కోరుకునే ఈ రోజుల్లో అంతమందికి సాయం చేస్తూ ఏళ్లపాటు దాన్ని రహస్యంగా ఉంచారంటే నిజంగా గొప్పేకదా! ఆడవాళ్లు అనుకుంటే ఓ విషయాన్ని ఎన్నిరోజులైనా తమలో దాచుకోగలరని ఈ సంఘటన నిరూపిస్తోంది!

నిరుపేదలకు అండగా నిలుస్తోన్న యువత - ఖమ్మం సిటీ.04 ఇన్​స్టా పేరిట సేవ కార్యక్రమాలు

పేద దంపతుల పెద్ద మనసు - అన్నార్థులకు అండగా రూ.10 లక్షలు విరాళం - Old Age Couple Huge help

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.