ETV Bharat / state

రూ.500లకే గ్యాస్​ సిలిండర్ పథకం -​ గైడ్​ లైన్స్ ఇవే - రూ500 గ్యాస్​ సిలిండర్​ గైడ్​లైన్స్

500 Gas Cylinder Scheme Guidelines : రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా చేపట్టిన రూ.500లకే గ్యాస్​ సిలిండర్​ పథకానికి మార్గదర్శకాలు జారీ చేసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

gas
RS 500 Gas Cylinder
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 8:37 AM IST

500 Gas Cylinder Scheme Guidelines : రాష్ట్ర ప్రజలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్​ సిలిండర్​ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మేరకు అర్హులైన లబ్ధిదారులు గడిచిన మూడు సంవత్సరాల్లో వాడిన గ్యాస్​ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకుని, ఆమేరకు రాయితీ సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.500లకు గ్యాస్​ సిలిండర్​ పథకం(Gas Cylinder Scheme) మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ పథకానికి అర్హతగా మూడు ప్రమాణాల్ని నిర్దేశించింది.

  • తెలంగాణలో తెల్లరేషన్​ కార్డు కలిగి ఉండాలి.
  • తెల్లరేషన్​ కార్డు ఉండి వారి పేరుతో వినియోగంలో ఉన్న గ్యాస్​ కనెక్షన్​ ఉండాలి.
  • డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్​ కోసం దరఖాస్తు చేసిన వారు అర్హులు.

ఈ పథకంలో వినియోగదారులు తొలుత సిలిండర్​కు పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. వారికి ఇచ్చే సబ్సిడీకి తగినంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్​ కంపెనీలకు చెల్లిస్తుంది. ఆ రాయితీ మొత్తాన్ని ఆయిల్ కంపెనీలు లబ్ధిదారు బ్యాంకు ఖాతాకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తారు. ఈ పద్ధతి ప్రస్తుతం పైలట్​ విధానంలో అమలవుతుంది.

సబ్సిడీ చెల్లించనున్న ప్రభుత్వం : లబ్ధిదారు సిలిండర్​కు రూ.500 మాత్రమే చెల్లించి అందుకునే విధానాన్ని పౌరసరఫరాలు, ఆర్థిక శాఖలు సమీప భవిష్యత్తులో తీసుకువస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రూ.500కు గ్యాస్​ సిలిండర్లు అందేలా జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలివ్వాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ పథకం అమలు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపింది. ఈ పథకానికి దరఖాస్తు చేయడం, సమాచారం అప్​డేషన్​, ధ్రువీకరణకు వచ్చేవారికి కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.

1.20 కోట్ల గ్యాస్​ కలెక్షన్లు : రాష్ట్రవ్యాప్తంగా 39.50 లక్షల మంది రాయితీపై గ్యాస్​ సిలిండర్ల లబ్ధిదారులు ఉన్నట్లు తేలింది. అందులో హైదరాబాద్​ జిల్లాలోనే అత్యధికంగా 3,55,153 మంది లబ్ధిదారులు ఉన్నారు. అత్యల్పంగా ములుగు జిల్లాలో 44,005 మందికే గ్యాస్​ సబ్సిడీ అందనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4,63,078 మందికి, ఆ తర్వాత ఉమ్మడి మెదక్​లో 4,11,091 మందికి, ఉమ్మడి ఖమ్మంలో 3,54,172 మందికి ఈ పథకంలో లబ్ధి అందనుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్​ కలెక్షన్లు ఉన్నాయి. సుమారు 89.99 లక్షల మందికి రేషన్​ కార్డులు ఉండగా వారిలో గ్యాస్​ రాయితీకి 39.50 లక్షల మంది మాత్రమే అర్హులుగా ఉన్నారు.

సచివాలయంలో సబ్సిడీ వంట గ్యాస్, ఫ్రీ కరెంట్ పథకాలు ప్రారంభం

ఫ్రీ కరెంట్​కు రేషన్‌ కార్డే ప్రామాణికం - మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.