3D Artist Sivaramakrishna From Peddapalli : మహాభారతంలోని మయసభ గురించి మీరంతా వినే ఉంటారు. ఆ మాయాసభలో అన్ని అద్భుతాలే. అచ్చం తాను వేసిన బొమ్మలతో అలాంటి అద్భుతాలే సృష్టిస్తున్నాడు ఈ యువ కళాకారుడు. అమెరికాలో జరిగిన ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్‌లో(International Street Art Festival) ఆసియా ఖండం నుంచి పాల్గొన్న ఏకైక త్రీడీ ఆర్టిస్ట్‌గా రికార్డులకెక్కాడు.
బతుకమ్మ బొమ్మ వేసి దాని ప్రత్యేకతను వివరిస్తున్న ఈ యువకుడి పేరు సింగారపు శివరామకృష్ణ. పెద్దపల్లి జిల్లా మంథనిలోని వ్యవసాయం కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు సింగారపు కిష్టయ్య, పోచమ్మల ప్రోద్బలంతో ఎమ్‌టెక్ పూర్తి చేసి త్రీడీ పెయింటింగ్ పైనే దృష్టి సారించాడు. చిన్నప్పటి నుంచి శివరామకృష్ణకు చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. చదువుతో పాటు ఏదైనా నైపుణ్యం ఉండాలని తల్లి ఇతనికి చిత్రాలు వేయడంలో ఓనమాలు దిద్దించింది.
Impressive 3D Paintings : నాటి నుంచి శివరామకృష్ణ బొమ్మలు వేయడంలో ప్రావీణ్యం సంపాదించాడు. కళానైపుణ్యం వైవిధ్యభరితంగా ఉంటే మంచి గుర్తింపు వస్తుందని, త్రీడీ పెయింటింగ్‌లో ఉన్న మెళకువలను పట్టుదలతో నేర్చుకున్నాడు. ప్రస్తుతం మంథని జేఎన్టీయూ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు శివరామకృష్ణ. దేశంలో త్రీడీ ఆర్టిస్టులు(3D Artists) తక్కువగా ఉన్నారని, అందుకోసమే ఎస్ఎస్ఆర్కే అకాడమీ స్థాపించి శిక్షణ ఇస్తున్నాని చెబుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రామకృష్ణ దగ్గర అమెరికా, రష్యాకు చెందిన వారు కూడా శిక్షణ పొందుతున్నారు.
World Cultural Festival 2023 : 'జీవితం చాలా చిన్నది.. ఘర్షణలు వద్దు.. మనమంతా ఒకే ఫ్యామిలీ'
యూఎస్ఏలోని డౌన్‌టౌన్ మిన్నియాపాలిస్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న 40 మంది అంతర్జాతీయ కళాకారులలో శివరామకృష్ణ ఒకరు. త్రీడీ పెయిటింగ్‌లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనిక్ వరల్డ్ రికార్డ్స్ లాంటి 12 ప్రపంచ రికార్డులను సాధించానని అంటున్నాడు.
"దాదాపు పన్నెండు ప్రపంచ రికార్డులతోపాటు, రెండు జాతీయ అవార్డులు, దేశరత్న అవార్డులు పొందాను. అంతేకాకుండా యునైటెడ్ థీలాజికల్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరెట్‌ను 2018లో రోశయ్య చేతుల మీదుగా తీసుకున్నాను. త్రీడీ ఆర్ట్ నేను వేసేటప్పుడు ఏవిధమైన ఇబ్బందులు పడ్డానో, అలాంటి ఇబ్బందులు ఎవరూ పడకుండా ఉండటానికి త్రీడీ ఆర్ట్‌పైన మంచి పుస్తకం రచించాను."- సింగారపు శివరామకృష్ణ, త్రీడీ కళాకారుడు
SSRK 3D Arts in More than 100 World Languages : రోడ్డు ప్రమాదాల నివారణ నేపథ్యంలో తను వేసిన త్రీడీ స్పీడ్ బ్రేకర్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందంటున్నాడు ఈ యువ కళాకారుడు. తన త్రీడీ ఆర్ట్స్‌ను మెచ్చి గ్రీస్, పాకిస్థాన్, సింగపూర్ దేశాల నుంచి ఆహ్వానం కూడా వచ్చిందని చెబుతున్నాడు. ఇంగ్లీష్, జపనీస్, గ్రీక్ వంటి 100కి పైగా ప్రపంచ భాషల్లో ఎస్ఎస్ఆర్కే త్రీడీ ఆర్ట్స్‌పై కథనాలు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాడు.
అంతర్జాతీయ త్రీడీ కళాకారుడిగా పేరొందిన శివరామకృష్ణను చూస్తే ఎంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఔరా అనిపించే కళానైపుణ్యంగా పేరున్న త్రీడీ పెయింటింగ్‌తో(3D Painting) అందరి దృష్టిని ఆకర్షిస్తున్న, తన కుమారుడుకి ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు. తాను స్థాపించిన ఎస్ఎస్ఆర్కే ఆకాడమీ ద్వారా యువతకు త్రీడీ పెయింటింగ్‌ను చేరువ చేయడమే తన లక్ష్యమని శివరామకృష్ణ అంటున్నాడు.
రమాదేవి పబ్లిక్ స్కూల్లో ఘనంగా ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ప్రదర్శన
చైనా యుద్ధ విద్యలో సత్తాచాటుతున్న అన్నాచెల్లెళ్లు - తండ్రి ప్రోత్సాహంతో వుషూ క్రీడలో రాణింపు