ETV Bharat / state

హైదరాబాద్​లో ఇంటర్నేషనల్ ఫొటో ఎగ్జిబిషన్ - మీడియా భాగస్వామిగా ఈటీవీ భారత్​ - 24 Hour Project Photo Exhibition

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 7:07 PM IST

Updated : Jul 5, 2024, 9:20 PM IST

24 Hour Project Photo Exhibition : 24 హౌర్స్​​ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ఫొటో ఎగ్జిబిషన్ 2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి ఈ నెల 14 వరకు జరిగే వేడుకకు మీడియా భాగస్వామిగా ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్​ వ్యవహరిస్తోంది. దేశవిదేశాల నుంచి ఫొటోగ్రఫీ నిపుణులు ఈ ఈవెంట్​కు వచ్చి తమ అనుభూతులను పంచుకోనున్నారు.

ETV Bharat 24 Hour Project
photographers for social change (ETV Bharat)

Photographers for Social Change : ఫొటోగ్రఫీ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతికత, సమాజ అభివృద్ధిలో వారి పాత్రపై జరిగే ప్రత్యేక 24 హవర్స్ ప్రాజెక్టు ఇంటర్నేషనల్ ఫోటో ఎగ్జిబిషన్​కు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఫొటోగ్రాఫర్స్ ఫర్ సోషల్ చేంజ్ పేరుతో చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో రేపటి నుంచి 14వ తేదీ వరకు ఈ వర్క్ షాప్ జరగనుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 127 ఉత్తమ ఫొటోలు ప్రదర్శన, సామాజిక మార్పులో ఫొటోల పాత్ర అనే అంశంపై చర్చలు, జూనియర్లకు నిపుణుల సూచనలు, ఫొటోగ్రఫీ రంగంలో వస్తున్న అధునాతన మార్పులు, ప్రదర్శన వంటి కార్యక్రమాలు ఉంటాయి.

దేశ నలుమూల నుంచి ఔత్సాహికులైన, అనుభవజ్ఞులైన వందలాది ఫొటోగ్రాఫర్లు ఇందులో పాల్గొననున్నారు. ఫొటోగ్రఫీ రంగంలో నిపుణులతో పాటు ఆయా కంపెనీలు ఈ వేడుకకు రానున్నాయి. ఫొటోగ్రాఫర్స్ ఫర్ సోషల్ ఛేంజ్ కాన్సెప్ట్​తో ఈ ఈవెంట్​ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ ఫోటో ఎగ్జిబిషన్ 2024 కోసం ఈటీవీ తెలంగాణ న్యూస్ ఛానల్, ఈటీవీ భారత్ మొబైల్ యాప్ ఈ వర్క్​షాప్​కు మీడియా పార్ట్​నర్​గా వ్యవహరించనున్నాయి.

ETV Bharat 24 Hour Project Hyderabad : ఇది భారతదేశంలో తొలిసారిగా ప్రారంభించిన స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ కార్యక్రమం. అంతర్జాతీయ న్యాయమూర్తులతో రూపొందించిన 127 ఫ్రేమ్డ్ ఫోటోలు, కోల్‌కతాలోని రెస్పాన్సిబుల్ ఛారిటీ ద్వారా నిర్వహించబడుతున్న స్వీయ-స్థిరమైన మహిళల కార్యక్రమాలకు మద్దతునిచ్చే అద్భుతమైన ఈవెంట్‌గా ఇది ప్రదర్శితమవుతుంది. దేశవిదేశాల నుంచి ఫొటోగ్రఫీ నిపుణులు ఈ ఈవెంట్​కు వచ్చి తమ అనుభూతులను పంచుకోనున్నారు.

ఈ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక విధానాలు, కొత్త ఫీచర్ల గురించి అవగాహన కల్పించనున్నారు. ఈ ఎక్స్ పో ద్వారా వచ్చిన ఫండ్స్​ను మహిళా సాధికారత కోసం కలకత్తాలోని రెస్పాన్సిబుల్ చారిటీకి ఇస్తామని కార్యక్రమ నిర్వాహకులు కరన్​ బాబు చెబుతున్నారు. ఇంతకు ముందు వేరే దేశాల్లో ఎగ్జిబిషన్ నిర్వహించిన 24 హవర్స్ ప్రాజెక్ట్ సంస్థ మొదటిసారిగా మన దేశంలో హైదరాబాద్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

వాట్సాప్ నయా ఫీచర్​ - ఇకపై గ్రూప్​లోనే 'ఈవెంట్ ప్లాన్​' చేయండిలా! - WhatsApp Event Planning

హైదరాబాద్​లో దేశంలోనే అతిపెద్ద యూరాలజీ సదస్సు - దేశ, విదేశాల నుంచి హాజరవుతున్న 800 మంది సర్జన్లు - Urology Conference In Hyderabad

Last Updated : Jul 5, 2024, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.