Kedarnath Helicopter Ticket Fraud In Mahbubnagar : థర్డ్ పార్టీలు, ట్రావెల్ ఏజెంట్ల నుంచి కేదార్నాథ్ వెళ్లేందుకు హెలికాప్టర్ బుక్ చేసుకున్న యాత్రికులను నట్టేట ముంచేశారు. అందరి నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టించారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం : మహబూబ్‌నగర్, అలంపూర్, హైదరాబాద్‌కు చెందిన 11 మంది యాత్రికులు ఉత్తరాఖండ్ వెళ్లారు. అయితే అక్కడి నుంచి కేదార్నాథ్ ఆలయానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం ఓ ప్రైవేటు ఏవియేషన్ సంస్థ పేరిట హెలికాప్టర్ టికెట్లు బుక్ చేసుకున్నారు. తీరా అక్కడకు వెళ్లాక అవి అధికారికంగా నమోదైన టికెట్లు కాదని, ఫేక్ టికెట్లని చెప్పడంతో షాక్ అయ్యారు.
"ఉత్తరాఖండ్‌లో కేదార్నాథ్ యాత్రకు వచ్చిన భక్తులకు హెలికాప్ట్ర్ దగ్గర టికెట్ విషయంలో మోసపోయిన బాధితులం. ఆన్లైన్లో హెలికాప్టర్ టికెట్ కోసం ఒక్కొక్కరి దగ్గర ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఫేక్ వెబ్సైట్లు అని తెలిసింది. ఏవీయేషన్ అధికారులు మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదు. మాలాగా చాలామంది ఇక్కడ మోసపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హెలిప్యాడ్ టికెట్లు ఉన్నాయంటే ఎవ్వరు నమ్మకండి. ప్రభుత్వం కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి." - బాధితులు
ఫాటా నుంచి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్లో వెళితే గుడికి వెళ్లేందుకు ఎక్కువగా నడవాల్సిన అవసరం ఉండదు. అందుకే నడవలేని వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం హెలికాప్టర్ టికెట్ బుక్ చేసుకుంటారు. నడకతో పాటు సమయం కూడా కలిసి వస్తుందని యాత్రికులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఇదే అదునుగా భావించిన అగంతకులు ఫేక్ వెబ్సైట్లు సృష్టించి వాటి ద్వారా టికెట్ విక్రయాలతో ఆన్లైన్లో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు.
ఒక్కో టిక్కెట్‌కు డిమాండ్‌ను బట్టి రూ. 5వేల 500 నుంచి రూ.8వేల 500 వరకూ తీసుకుంటున్నారు. అలా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన దాదాపు 200 మంది యాత్రికులు ఇప్పటి వరకు మోసపోయారని సమాచారం. దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని యాత్రికులు కోరినా ఆ సర్కార్ నుంచి సరైన స్పందన లేదని యాత్రికులు వాపోతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన 11 మంది యాత్రికులు కూడా ఇలాగే మోసపోయారు.
SBI కస్టమర్లకు అలర్ట్ - ఆ లింక్స్‌పై క్లిక్ చేశారో - ఇక అంతే! - Alert To SBI Customers
SRH VS RCB ఐపీల్ మ్యాచ్ టికెట్లు - ఆ లింక్ క్లిక్ చేస్తే డబ్బులు మాయం - SRH vs Rcb Fake Tickets