10% Discount for Passengers in APSRTC Dolphin Cruise, Amaravathi Buses : పండుగ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున సొతూళ్లకు వెళ్త్తుంటారు. ఈ సమయంలో బస్సుల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో బస్సుల సంఖ్య పెంచడం, టికెట్ ధరలు పెంపు, తగ్గింపులు సాధారణమే. ఈ క్రమంలోనే 10 శాతం రాయితీ అందిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సులు ప్రయాణికులకు గూడ్‌న్యూస్ చెప్పాయి.
ప్రయాణికులకు శుభవార్త : విజయవాడ టు హైదరాబాద్, బెంగళూరు నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు ఆదివారం (అప్), శుక్రవారం (డౌన్)లను మినహా మిగిలిన రోజుల్లో టిక్కెట్ ఛార్జీలపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణాధికారి ఎం.వై దానం శుక్రవారం ప్రకటన ద్వారా వెల్లడించారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ఎంజీబీఎస్‌కు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 770 ఉండగా, మిగిలిన రోజుల్లో 700 రూపాయలు, తదుపరి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం సాధారణ ఛార్జీ 830 రూపాయలు ఉండగా మిగిలిన రోజుల్లో రూ. 750గా నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ జర్నీ చేసే వారికి : హైదరాబాద్ టు విజయవాడ జర్నీ చేసేవారికి శుక్రవారం రోజు సాధారణ ఛార్జీ, మిగిలిన రోజుల్లో రాయితీ ఛార్జీ వసూలు చేస్తారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వెన్నెల స్లీపర్ ఏసీ బస్సుల్లో ఆదివారం మెజిస్టెక్ బస్టేషన్ వరకు సాధారణ ఛార్జీ రూ. 2,170 ఉండగా, మిగిలిన రోజుల్లో 1970, ఆపై ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం రూ. 2210, మిగిలిన రోజుల్లో రూ. 2010 ఉంటుంది.
అమరావతి మల్టీ యాక్సిల్ బస్సుల్లో ఆదివారం మెజిస్టిక్ బస్టేషన్ వరకు సాధారణ ఛార్జీ రూ.1870, మిగిలిన రోజుల్లో రూ.1700, ఆపై ప్రాంతాలకు ఆదివారం సాధారణ ఛార్జీ 1930, మిగిలిన రోజుల్లో రూ. 1750 గా రాయితీ కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
సంక్రాంతికి ఊరెళ్లాలా? - అయ్యో!! టికెట్లు లేవండి బాబు - SANKRANTI TRAIN TICKETS ISSUE
South Central Railway Economy Meals : రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ స్టేషన్లలో రూ.50కే భోజనం