ETV Bharat / sports

తొలి టీ20లో టీమ్​ఇండియాకు షాక్​ - జింబాబ్వే విజయం - Zimbabwe vs India - ZIMBABWE VS INDIA

Zimbabwe vs India first T20 : జింబాబ్వేతో టీ20 సిరీస్​లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓడిపోయింది. పూర్తి మ్యాచ్​ వివరాలు స్టోరీలో.

source Associated Press
IND VS Zimbabwe first T20 (source Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 8:02 PM IST

Updated : Jul 6, 2024, 8:19 PM IST

Zimbabwe vs India first T20 : టీ20 ప్రపంచకప్‌ 2024 సాధించిన టీమ్ ఇండియాకు జింబాబ్వే షాక్‌ ఇచ్చింది. విజయోత్సాహాల నుంచి ఇంకా బయటపడక ముందే ఓటమి రుచి చూపించింది. 5 టీ20 సిరీస్​లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓడిపోయింది. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటయ్యింది. 13 పరుగులు తేడాతో ఓడిపోయింది.

లక్ష్య ఛేదనలో టీమ్​ఇండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే బ్రియాన్‌ బెన్నెట్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మ (0) వెనుదిరిగాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ( 29 బంతుల్లో 31; 5×4) టాప్ స్కోర్​గా నిలిచాడు. అతడు తొలి డౌన్‌లో వచ్చిన రుతురాజ్‌ గైక్వాడ్‌ (7)తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించేందుకు ట్రై చేశాడు. కానీ ముజరబాని బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి గైక్వాడ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్‌ పరాగ్ (2), రింకూ సింగ్‌ (0), ధ్రువ్‌ జురెల్‌ (7) వరుసగా ఫెయిల్ అయ్యారు. అనంతరంగిల్‌ను సికిందర్‌ బౌల్డ్‌ చేశాడు. చివర్లో వచ్చిన రవి బిష్ణయ్‌ (9), అవేశ్‌ ఖాన్‌ (12 బంతుల్లో 16; 3×4) వాషింగ్టన్‌ సుందర్‌ ( 34 బంతుల్లో 27;1×4, 1×6) పోరాడినా ఫలితం దక్కలేదు. చటార (3/16), సికిందర్ రజా (3/25) భారత్‌ను గట్టిగానే దెబ్బకొట్టారు. బెన్నెట్, మసకద్జా, జాంగ్వి, ముజరబాని తలో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన జింబాబ్వే ఇన్నింగ్స్​లో భారత బౌలర్లు అదరగొట్టారు. రవి బిష్ణోయ్ (4/13), వాషింగ్టన్ సుందర్ (2/11) విజృంభించారు. దీంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ (23), డియోన్ మేయర్స్ (23), మద్వీర (21), సికిందర్ రజా (17) పరుగులు చేశారు. చివర్లో క్లైవ్ మదాండే (29*) పోరాడటంతో కాస్త ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్ కూడా తలో వికెట్ తీశారు.

ఇక టీమ్​ఇండియా టార్గెట్‌ అదే - ఇప్పటికే రెండు సార్లు మిస్‌! - ICC World Test Championship

సంగీత్ సెలబ్రేషన్స్​లో స్పెషల్ మూమెంట్ - వరల్డ్ కప్​ విన్నర్స్​కు దిష్టి తీసిన నీతా అంబానీ - Nita Ambani Praises Rohith Sharma

Last Updated : Jul 6, 2024, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.